కరీంనగర్ , ప్రతినిధి : తెలంగాణ చూశాక చస్తాను అన్న కాకా వెంకటస్వామి అన్న మాట ప్రకారం తెలంగాణ వచ్చాక తనువు చాలించారని.. ఆయన సుదీర్ఘ రాజకీయంలో ఇది ఆయన పట్టుదలను సూచిస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ లో కాకా వెంకటస్వామి సంస్మరణ సభ కరీంనగర్ డీసీసీ అద్యక్షులు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పొన్నం ప్రభాకార్ మాట్లాడారు. కాంగ్రెస్ ను ఐక్యం చేసిన మహనీయుడు కాకా.. అని పేదవర్గాలకు అండగా కాకా నిలబడ్డారని ప్రశంసించారు… అణగారిన వర్గాల కోసం పోరాడిన కాకా ఇంత పెద్ద నాయకుడిగా ఎదిగాడని పొన్నం కొనియాడారు. కాకా అనుభవించిన పదవి లేదని.. ఆయన కాంగ్రెస్ సభ్యుడుగా.. కేంద్ర మంత్రిగా అత్యున్నత స్థానం పొందారని ప్రశంసించారు.
తన కుటుంబసభ్యులను కూడా కాంగ్రెస్ పట్ల క్రమశిక్షణతో పెంచారని.. కాంగ్రెస్ భావాల్ని నరనరాన జీర్ణించుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. వెంకటస్వామి ట్రస్ విశాఖ సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని.. అంబేద్కర్ తో కలిసి రాజకీయం చేసిన ఒకే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కాకా అని పేర్కొన్నారు.