న్యూఢిల్లీ , ప్రతినిధి : ఓట్ల కోసం గరీబీ హఠావో నినాదాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందని, పేదరికం తగ్గకపోగా మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోడి దుయ్యబట్టారు. న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.
కుర్చీని కాపాడుకోవడానికి లేదా కుర్చీ కోసం ఈ నినాదాలు చేసిందే తప్ప పేదప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. తాము కుల మత, జాతి విభేధాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే దేశంలోని తమ భవిష్యత్తుకోసం ఎన్నో ఆశలు పెట్టుకుందని వారి ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మోడీ తెలిపారు.