చైన్నై, ప్రతినిధి : విక్రమ్ హీరోగా నటించిన ‘ఐ’ మూవీ రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. ముందుగా ఫిక్స్ చేసిన రోజునే మూవీ రిలీజ్ కానుంది. మూవీ ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్లకు మధ్య ఆర్ధికపరమైన గొడవలు రావడంతో ఫైనాన్షియర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 30 వరకూ మూవీని రిలీజ్ చేయవద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్…ఫైనాన్షియర్ల ఇవ్వాల్సిన డబ్బును ఇచ్చేశారు. ఇద్దరి మధ్య ఇబ్బందులు తొలగడంతో ‘ఐ’ మూవీని ఫిక్స్ చేసిన డేట్ రోజునే రిలీజ్ చేయనున్నారు.