తెలంగాణ, ఎపీల మధ్య ఎంసెట్ వివాదంపై జోక్యం చేసుకోనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆన్నారు. విభజన చట్టాల్లోని అంశాల్లో వివాదాలు తలెత్తినప్పుడు గవర్నర్, లేదా కేంద్ర హోంమంత్రిని సంప్రదించాలన్నారు. ‘గవర్నర్ తో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల విద్యా శాఖా మంత్రులు సమస్యను పరిష్కరించుకుని ఉంటే చాలా బాగుండేది’ అని వెంకయ్య అభిప్రాయపడ్డారు.