చెన్నై, ప్రతినిధి : ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చాన వానా’…. అంటూ ‘వర్షం’ మూవీతో టాలీవుడ్‌ను షేక్ చేసిన తమిళ ముద్దుగుమ్మ త్రిష… పెళ్లి కూతురు కాబోతోంది. ప్రియుడు, తమిళ నిర్మాత అయిన వరుణ్ మణియన్‌ను మనువాడబోతోంది. ఈనెల 23న తమిళ సంప్రదాయ పద్ధతుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు అమ్మడు సోషల్ సైట్లో ట్వీట్ చేసింది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’… అంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న త్రిష…మ్యారేజీకి మాత్రం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కే ఆహ్వానం అంటోంది.
పెళ్లి ఎప్పుడు అనేది సస్పెన్స్
కానీ పెళ్లి ఎప్పుడు అనేది సస్పెన్స్ గానే ఉంచింది త్రిష. అంతమాత్రానికే ఊహాగానాలు, ప్రచారాలు ఏమీ చేయక్కర్లేదని… మ్యారేజ్ డేట్ ఫిక్స్ కాగానే ఆ తియ్యంటి కబురు తానే స్వయంగా చెప్పేస్తానంది. అయితే పెళ్లయినా సినిమాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనేమి లేదని చెప్పుకొచ్చిందీ బామ.
మార్చి, డిసెంబర్‌లో పెళ్లి..?
మార్చిలో కానీ డిసెంబర్‌లో కానీ వరుణ్, త్రిష ఒకింటివారయ్యే అవకాశాలున్నాయని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో బాలయ్య సరసన ‘లయన్’ సినిమాలో ఈ చెన్నై బ్యూటీ నటిస్తోంది. అటు తమిళంలో అజిత్ సరసన చేసిన ‘ఎన్నై అరిందాల్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తానికి న్యూ ఇయర్‌లో పెళ్లి కబురు చెప్పి ఫ్యాన్స్ ను కాస్తా కంగారు పెట్టినా… మ్యారేజ్ అయినా మూవీస్ కంటిన్యూ చేస్తానంటూ వారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసింది.