By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
    October 2, 2026
    జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
    October 2, 2026
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
    September 29, 2026
    వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    September 26, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: శభాష్ రాజేందర్ అన్న..
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Uncategorized > శభాష్ రాజేందర్ అన్న..
Uncategorized

శభాష్ రాజేందర్ అన్న..

Last updated: 2026/02/28
Published February 28, 2026 Uncategorized
Share
SHARE

కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా పనిచేశారు..

మంచి ఫలితాలు సాధించారు..

కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచారు..

కీప్ ఇట్ ఆప్..

వెలిచాల రాజేందర్రావును
అభినందించిన ముఖ్యమంత్రి

పలు అంశాలపై
దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి

ఓటమి చెందామని కృంగిపోకండి..

ప్రజల్లోనే ఉండండి..

వచ్చే అసెంబ్లీ వరకు కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టపరచండి..

కరీంనగర్ ప్రజల కష్టసుఖాల్లో వెన్నంటే ఉండాలని సీఎం సూచన..

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావు చాలా బాగా పనిచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

శనివారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం.. ప్రచారం తీరు.. ప్రత్యేకంగా చేపట్టిన ప్రణాళిక.. ఎన్నికల ఫలితాలు.. తధానంతర పరిణామాలు..కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం.. గతంలో 0 నుంచి 14 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఎదగడం.. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజేందర్రావు ముఖ్యమంత్రితో చర్చించారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారు. రాజేందర్ రావు కు ముఖ్యమంత్రి కొన్ని సూచనలు సలహాలు అందించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజేందర్ అన్న మీరు చాలా బాగా పనిచేశారు. ప్రజల్లో మీ మీద మంచి అభిప్రాయం ఉంది. పార్టీ గ్రాఫ్‌ పెంచారు. పట్టుదలతో పని చేస్తూ, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారనీ వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఎమ్మెల్యే ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండి ఇంకా పార్టీ గ్రాఫ్‌ను పెంచాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వరకు అహర్నిశలు కష్టపడి పని చేయాలని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని రాజేందర్రావుకు ముఖ్యమంత్రి సూచించారు. స్వార్థం లేకుండా పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించారని సీఎం ప్రశంసించారు. కరీంనగర్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే ఎన్నికైన కార్పొరేటర్లను కలుస్తానని, కరీంనగర్‌కు వచ్చి బహిరంగ సభలో పాల్గొని కరీంనగర్ ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా ప్రకటిస్తామని రాజేందర్ రావు తో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పదిమంది అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని రాజేందర్రావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఏమాత్రం అధైర్య పడకుండా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా పేదలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. కరీంనగర్ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి వారి కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని ప్రజలకు విశ్వాసం కల్పించాలని సీఎం సూచించారు. కరీంనగర్ ను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారని రాజేందర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వెన్ను తట్టి అభినందించడం మరిచిపోలేనని రాజేందర్రావు పేర్కొన్నారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు ముందుకెళ్తానని తెలిపారు. కరీంనగర్ గడ్డను కాంగ్రెస్ అడ్డాగా మారుస్తామని రాజేందర్ రావు పేర్కొన్నారు.

You Might Also Like

గంగుల…. మూట ముల్లె సర్దుకుని వెళ్లిపో…

అక్రిడిటేషన్ కార్డుల జారీ జీవోలో సవరణలు

టీయూడబ్ల్యూజే తోనే జర్నలిస్టులకు న్యాయం

Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article జాతీయ కరాటే విజేతలకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు
Next Article న్యాయవాదులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది
- Advertisement -
Ad imageAd image

Latest News

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
News Political News Telangana
జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
Media & Press News Political News Telangana
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
News Political News Telangana
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
News Political News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?