* న్యూఢిల్లీ లోని లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులను టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఘనంగా సన్మానించారు.
* సీనియర్ -55 కేజీల కుమిటే విభాగంలో స్వర్ణ పతకం సాధించిన పి. బబ్బి వర్మను, అండర్-21 సంవత్సరాల -84 కేజీల కుమిటే విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న కె. కౌశిక్ ప్రణయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు.
* ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకువచ్చిన ఈ యువ క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, కఠిన సాధన, పట్టుదలతో ముందుకు సాగితే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించే అవకాశం ఉందన్నారు. క్రీడలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని, గ్రామీణ స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంపొందించాలన్నారు.
* క్రీడాకారుల కుటుంబ సభ్యులు, కోచ్‌లు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ యువత క్రీడా రంగంలో మరింతగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
mattis, pulvinar dapibus leo.