By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: కార్పొరేషన్ లో అవినీతి జరగకుండా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం..
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > కార్పొరేషన్ లో అవినీతి జరగకుండా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం..
NewsPolitical NewsTelangana

కార్పొరేషన్ లో అవినీతి జరగకుండా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం..

Last updated: 2026/02/16
Published February 16, 2026 News Political News Telangana
Share
SHARE

చిన్న అవినీతి జరిగినా బిజెపిని
విడిచి పెట్టే ప్రసక్తే లేదు..

బిజెపి పాలకవర్గం పారదర్శకంగా
పాలన సాగించాలి..

ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు బిల్డింగ్ పర్మిషన్లపై నిఘా పెడతాం..

ప్రజల పక్షాన నిలుస్తాం..

అవినీతి అక్రమాలు జరగకుండా చూస్తాం..

కరీంనగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తా..

అవినీతికి పాల్పడ్డ వారే మేయర్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు..

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ నగర పాలక సంస్థలో కొత్తగా ఏర్పడిన బిజెపి పాలకవర్గం ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థ విజిలెన్స్ సెల్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన కార్పొరేటర్ మేయర్ గా, మేయర్ గా పని చేస్తున్న వ్యక్తి డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.

సోమవారం సాయంత్రం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి వెలిచాల రాజేందర్ రావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్రావు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్న అవినీతి జరిగినా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రతి డివిజన్లో జరిగే అభివృద్ధి పనులు బిల్డింగ్ పర్మిషన్లు ఇతరత్రా పనులపై పర్యవేక్షణకు ప్రత్యేక విజిలెన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పని ప్రతి పేమెంటు మానిటరింగ్ చేసి నాణ్యత పరిశీలించి ప్రభుత్వం బిల్లులు చెల్లించేలా కృషి చేస్తామన్నారు. ప్రజలను అవినీతి అక్రమాల నుంచి కాపాడుతామని స్పష్టం చేశారు. బిజెపి పాలకవర్గం అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిరంతరం నిఘా పెడతామని తేడాలు వస్తే ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని బిజెపి పాలకవర్గం జాగ్రత్తగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. గత బిఆర్ఎస్ హాయంలో జరిగినట్లు
అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నాడు కేంద్రమంత్రి బండి సంజయ్ సునీల్ రావు అవినీతిపరుడని అనేకసార్లు విమర్శించి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. నాడు విమర్శించి నేడు మళ్ళీ డిప్యూటీ మేయర్గా ఎంపిక చేయడంపై ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని మళ్లీ పదవులు ఇవ్వడం పట్ల విస్మయం కలుగుతుందన్నారు. కార్పొరేషన్ లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అవతరించినా
కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సహకారంతో కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా పెద్ద ఎత్తున నిధులు తెస్తానని పేర్కొన్నారు. ఎవరు చేయని విధంగా ఏ ఎమ్మెల్యే తేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని రాజేందర్ రావు తెలిపారు. కరీంనగర్ లో అవినీతికి ఆస్కారం లేకుండా క్లీన్ గా పాలన సాగించేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. ప్రతి అభివృద్ధి పనిపై మానిటరింగ్ చేసి బిల్లులు ఇప్పించేలా చూస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుకు కట్టుబడి పని చేస్తామన్నారు. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు బిల్డింగ్ పర్మిషన్లు ఇతరత్రా ప్రజా అవసరాలకు ఎలాంటి డబ్బులు ఆశించకుండా బిజెపి పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఒకవేళ అవినీతి అక్రమాలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో జాగ్రత్తగా అప్రమత్తంగా బిజెపి పాలకవర్గం పనిచేయాలని సూచించారు. కరీంనగర్ రైసింగ్ ఆర్గనైజేషన్ పేరిట ప్రతి డివిజన్లో ముగ్గురు వ్యక్తులతో కలిసి కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి డివిజన్లో జరిగే అభివృద్ధి పనులు బిల్డింగ్ పర్మిషన్లు ఇతరత్రా పనులకు సంబంధించి పర్యవేక్షణ చేస్తుందన్నారు. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మేలు జరిగేలా చూస్తామన్నారు. కరీంనగర్ ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు మేనిఫెస్టో ప్రకారం కరీంనగర్ అభివృద్ధికి కృత నిశ్చయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న, భాస్కర్ నాయక్ గుమ్మడి రాజకుమార్, ఆకుల నందిని ఉదయ్, పడిశెట్టి వసంత లక్ష్మి భూమయ్య, కల్లేపల్లి శారద బాలరాజు, సికిందర్ ఇక్రమ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:#VigilanceCell #StopCorruption #TransparentGovernance #CleanAdministration #AccountableCorporation
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article సామాన్యుడికే కరీంనగర్ మేయర్ పట్టం
Next Article *చంద్రబాబు విజన్‌కు ప్రపంచ గుర్తింపు
- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?