By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
    October 2, 2026
    జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
    October 2, 2026
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
    September 29, 2026
    వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    September 26, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: *చంద్రబాబు విజన్‌కు ప్రపంచ గుర్తింపు
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Andhra Pradesh > *చంద్రబాబు విజన్‌కు ప్రపంచ గుర్తింపు
Andhra PradeshGovernment & DevelopmentInternational RelationsInvestment & DevelopmentLeadershipNews

*చంద్రబాబు విజన్‌కు ప్రపంచ గుర్తింపు

Last updated: 2026/02/17
Published February 17, 2026 Andhra Pradesh Government & Development International Relations Investment & Development Leadership News
Share
SHARE

(పొలిటికల్ ఫ్యాక్టరీ – విజయవాడ )

బిల్ గేట్స్ ప్రశంసలు రాష్ట్రానికి గర్వకారణం*

–తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

*విజన్ ఉన్న నాయకుడు విలువ ప్రపంచానికి తెలిసింది. అందులో భాగం గానే ప్రపంచంలోనే అపర కుబేరుడు గా పేరు గాంచిన మైక్రోసాఫ్ట్ ఫౌండర్ , గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, ముఖ్యమంత్రి శ్ నారా చంద్రబాబు నాయుడు పాలనా విధానాన్ని, టెక్నాలజీ దూరదృష్టిని ప్రశంసించడం రాష్ట్రానికి గర్వకారణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించి, అక్కడ అమలవుతున్న రియల్ టైమ్ గవర్నెన్స్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
వివరించిన పాలనా నమూనాపై ఆసక్తి చూపించడం ఆయన విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందనే విషయాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు.

చంద్రబాబు దూరదృష్టిపై బిల్ గేట్స్ ప్రత్యేక ప్రశంసలు

బిల్ గేట్స్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గ్లోబల్ స్థాయి దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పాలన, టెక్నాలజీ వ్యవస్థలను పరిశీలించిన తన అనుభవంలో, డిజిటల్ గవర్నెన్స్‌ను ప్రజల జీవితాలతో ఇంత సమర్థంగా మేళవించిన నాయకుడు చాలా అరుదని వ్యాఖ్యానించారు. డిజిటల్ గవర్నెన్స్ గురించి ప్రపంచ వేదికలపై తాను సిద్ధాంతపరంగా వివరిస్తుంటే, ఆ సిద్ధాంతాలను నేలమీద కార్యరూపం దాల్చేలా అమలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని బిల్ గేట్స్ స్పష్టం చేయడం విశేషమన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా పాలనను వేగవంతం చేయడం, ప్రజల అవసరాలను రియల్ టైమ్‌లో గుర్తించి స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం ఆయన ముందుచూపుకు నిదర్శనమని గేట్స్ ప్రశంసించారు.

డిజిటల్ విప్లవంలో చంద్రబాబు కీలక పాత్ర

భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషిస్తున్నారని బిల్ గేట్స్ స్పష్టంగా పేర్కొనడం రాష్ట్రానికి గర్వకారణమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. టెక్నాలజీని కేవలం పరిపాలన కోసం కాకుండా, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ వంటి ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే రంగాల్లో ఉపయోగించడం చంద్రబాబు గారి ప్రత్యేకత అని గేట్స్ వ్యాఖ్యానించారని తెలిపారు.

చంద్రబాబు –భవిష్యత్ ని ముందే చూసే నాయకుడు

తాను తొలిసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడే ఆయన ఆలోచనల్లో అసాధారణమైన ముందుచూపు కనిపించిందని బిల్ గేట్స్ గుర్తు చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయమన్నారు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యాధునిక నగరాలుగా ఎదిగిన కొన్ని దేశాల నేతలతో పోల్చదగ్గ విజన్ చంద్రబాబు గారిలో ఉందని, నాటి సింగపూర్ ప్రధాని స్థాయిలో ఆలోచించిన భారతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని గేట్స్ వ్యాఖ్యానించడం ఆయన విజనరీ నాయకత్వానికి ప్రపంచ స్థాయి గుర్తింపుగా పల్లా అభివర్ణించారు.

స్వర్ణాంధ్ర–2047కు గేట్స్ ఫౌండేషన్ మద్దతు

స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యాలను సాధించడంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని బిల్ గేట్స్ స్పష్టంగా చెప్పడం, చంద్రబాబు నాయుడు గారి దీర్ఘకాలిక అభివృద్ధి దృష్టికి లభించిన అంతర్జాతీయ మద్దతుగా పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమాన్ని బిల్ గేట్స్ “అద్భుతమైన మోడల్”గా ప్రశంసించడం, చంద్రబాబు గారి ప్రజాకేంద్రిత పాలనకు నిదర్శనమన్నారు.

‘గుడ్ ఓల్డ్ ఫ్రెండ్’గా చంద్రబాబు

చంద్రబాబు నాయుడు గారిని తన “గుడ్ ఓల్డ్ ఫ్రెండ్”గా బిల్ గేట్స్ సరదాగా వ్యాఖ్యానించడం, దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పరస్పర గౌరవం, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. 90వ దశకంలో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు చంద్రబాబు గారు మద్దతు ఇచ్చిన దూరదృష్టే, నేటి డిజిటల్ పాలనకు పునాది అయిందని బిల్ గేట్స్ స్పష్టం చేయడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

You Might Also Like

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

TAGGED:#ChandrababuNaidu #VisionaryLeadership #GlobalRecognition #ProgressiveGovernance #FutureFocused
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article కార్పొరేషన్ లో అవినీతి జరగకుండా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం..
Next Article సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నహీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన పెళ్లి కార్డు
- Advertisement -
Ad imageAd image

Latest News

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
News Political News Telangana
జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
Media & Press News Political News Telangana
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
News Political News Telangana
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
News Political News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?