కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
వెలిచాల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన సమాజ సేవకురాలు ప్రముఖ సామాజిక కార్యకర్త
మునిపళ్లి ఫణిత
ప్రముఖ సామాజిక కార్యకర్త సమాజ సేవకురాలు ఆపదలో ఉన్న పేదలకు సహాయం చేసే మునిపళ్లి ఫణిత కాంగ్రెస్ పార్టీలో చేరిన అభినందనీయమనీ, ఆమెకు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
మంగళవారం కరీంనగర్లోని 9 వ డివిజన్ చెందిన మునిపళ్లి ఫణిత వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రముఖ సామాజిక సేవకురాలు పేదలకు సహాయం చేసే మునిపల్లి ఫనిత కాంగ్రెస్ పార్టీలో చేరడం మరింత బలాన్ని వచ్చిందని తెలిపారు. ఆమె అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పానెల్ నుంచి పోటీ చేసి అత్యధిక ఓట్లను సాధించిందని గుర్తు చేశారు. ప్రజల్లోను మంచి ఆదరణ ఉందని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఫనిత ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫణిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అత్యధిక ప్రాధాన్యతమిస్తున్నారని వారిని అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వశక్తి మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు ఓనర్లుగా చేయడం సోలార్ పవర్ ప్లాంట్ లు నిర్వహణ బాధ్యతలు అప్పగించి వారిని కోటీశ్వరులు చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ విధానాలు నచ్చి పార్టీలో చేరినట్లు చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తన శక్తి యుక్తులు ఉపయోగించి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని ఫణిత పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న పడిశెట్టి భూమయ్య నాయకులు పన్యాల శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.