By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: బండి ర్యాలీకి అనూహ్య స్పందన
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Political News > బండి ర్యాలీకి అనూహ్య స్పందన
Political NewsTelangana

బండి ర్యాలీకి అనూహ్య స్పందన

Last updated: 2024/04/25
Published April 25, 2024 Political News Telangana
Share
SHARE

మండుటెండలో జన నీరాజనం

పిల్లలు, పెద్దలు, మహిళలుసహా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కేరింతలు

పూలు చల్లి కొందరు..హారతి ఇచ్చి మరికొందరు నీరాజనం

టవర్ సర్కిల్ వద్ద బ్రహ్మరథం పట్టిన వ్యాపారులు..

వేలాదిగా తరలిరావడంతో కాషాయ సంద్రమైన కరినగరం

బండి నామినేషన్ కు భారీగా హాజరైన కార్యకర్తలు

ఎస్సారార్ కాలేజీ నుండి టవర్ సర్కిల్ మీదుగా గీతాభవన్ వరకు…

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.
నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గుజరాత్ సీఎం భూపేంద్ర భాయి రజనీకాంత్ పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఉదయం 10.30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు రాగానే బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, క్రిష్నారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ గన స్వాగతం పలికారు. అక్కడి నుండి సరిగ్గా ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ రావడంతో వారితో కలిసి బండి సంజయ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం 11.20 గంటలకు అక్కడి నుండి నేరుగా ఎస్సారార్ కళాశాల వద్దకు వచ్చారు. ఉదయం 9 గంటలకే ఎస్సారార్ కళాశాల వద్దకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు.. భూపేంద్రభాయి పటేల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఘన స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం… వేలాది మందితో కలిసి ర్యాలీగా బయలుదేరారు.. కొద్దిదూరం ర్యాలీలో పాల్గొన్న అనంతరం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. వారికి వీడ్కోలు పలికిన బండి సంజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్సారార్ కాలేజీ నుండి కోర్టు చౌరస్తా, రాజీవ్ చౌక్, గంజ్, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్, కమాన్, గీతాభవన్ వరకు…దాదాపు రెండున్నర గంటలపాటు ర్యాలీ నిర్వహించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా చిన్నారులు, మహిళలు, వ్రుద్దులు సైతం ఇండ్ల నుండి బయటకు వచ్చి బండి సంజయ్ ను చూసి అభివాదం చేయడం, విక్టరీ సింబల్ చూపుతూ సంతోషం వ్యక్తం చేశారు. పలు చోట్ల మహిళలు ఎదురేగి పూలు చల్లి, హరతి పట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం గమనార్హం.
ఇగ చిన్న పిల్లలు, యువత ఆనందానికి హద్దు లేదు. బండి సంజయ్ ను చూడగానే ‘అదిగో బండి సంజయన్న’’ అంటూ బండి సంజయన్న జిందాబాద్… మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ర్యాలీలో డీజే పాటలను వింటూ యువత తీన్మార్ డ్యాన్సులు చేశారు….దారి వెంట వెళుతూ ఆటోవాలాలు, ద్విచక్రవాహనదారులు, కాలిబాటన వెళ్లే పౌరులు..ఇలా ప్రతి ఒక్కరూ సంజయ్ ను చూస్తూ అభివాదం చేశారు.
మరోవైపు టవర్ సర్కిల్ వద్ద వ్యాపారుల నుండి అనూహ్య స్పందన లభించింది. బండి సంజయ్ వద్దకు వ్యాపారులు స్వచ్చందంగా తరలి వచ్చి స్వాగతం పలుకుతూ కొందరు, కరచాలనం చేస్తూ మరికొందరు, ఆయన వద్దకు వచ్చి ఆలింగనం చేస్తూ ఇంకొందరు తమ అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకున్నారు. మొత్తంగా మిట్ట మధ్యాహ్నం 45 డిగ్రీల మండుటెండను సైతం లెక్క చేయకుండా బండి సంజయ్ ర్యాలీకి కార్యకర్తలు దాదాపు మూడు గంటలపాటు ర్యాలీ నిర్వహించడం.. ప్రజలు నుండి అనూహ్య స్పందన రావడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి..

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:bandi sanjaybjpkarimnagarkishanreddypoliticalfactoryrally
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article బండి సంజయ్ నామినేషన్
Next Article నేటితో నామినేషన్ గడువు ముగింపు
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?