తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మంలో రెండు రోజులపాటు జరిగిన మాసవానంతరం ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులుగా విరహత్ అలీ కొద్దిరోజుల క్రితం ఎన్నిక కాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కే రామనారాయణ ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా గాడి పల్లి మధు ( వరంగల్ ), పైసల్ (సంగారెడ్డి ), బుర్ర సంపత్ కుమార్ (పెద్దపల్లి ), కార్యదర్శులుగా కే శ్రీకాంత్ రెడ్డి ( రంగారెడ్డి) , జి మధు గౌడ్ (వనపర్తి ) ,బి యాదగిరి ( హైదరాబాద్ ) , కోశాధికారిగా మూత వెంకటరెడ్డి (మేడ్చల్) , కార్యవర్గ సభ్యులుగా ఎం వేణుగోపాలరావు ( ఖమ్మం ) , పి వేణు మాధవరావు (హనుమకొండ ) ,ఆర్ ప్రకాష్ రెడ్డి (మంచిర్యాల ) ,మిరియాల కర్ణయ్య (నాగర్ కర్నూల్ ) , డిజి శ్రీనివాస్ శర్మ (మెదక్ ) , పి ప్రభాకర్ రెడ్డి ( నల్గొండ ) , సయ్యద్ అబ్దుల్ లతీఫ్ (కామారెడ్డి ) , జె సురేంద్ర కుమార్ ( జగిత్యాల ) , ఎలగందుల రవీందర్ ( కరీంనగర్ ) , ఏ రాజేష్ (హైదరాబాద్ ) కె రాజిరెడ్డి (సిద్దిపేట ) , సయ్యద్ గౌస్ మోయుద్దిన్ ( హైదరాబాద్ ) , కే అనిల్ కుమార్ ( హైదరాబాద్ ) , చలసాని శ్రీనివాసరావు (సూర్యాపేట ) ,కంకణాల సంతోష్ ( హనుమకొండ ) , గుడిపల్లి శ్రీనివాస్ ( రంగారెడ్డి ) లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు , తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి , ఐజేయు మాజీ అధ్యక్షులు ఎస్ ఎన్ Sinha , దేవులపల్లి అమర్ , వై నరేందర్ రెడ్డి , ఎంఏ మాజీద్ , రాష్ట్ర మాజీ అధ్యక్షులు నంగునూరు శేఖర్ , ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు అయిలు రమేష్ ,ఎన్నికల అధికారి శేషు సహాయ ఎన్నికల అధికారి మల్లన్న గౌడ్ లు అభినందించారు.వారికి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపారు.