(పొలిటికల్ ఫ్యాక్టరీ – జమ్మికుంట )
2 కిలోమిటర్లు భూజాన మోసుకెళ్ళి ప్రాణాలు కాపాడిన పోలీసు వివరాలు ఇలా ఉన్నాయి..
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఈరోజు కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవ పడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు.
అది గమనించిన రైతులు 100కి సమాచారం ఇవ్వగా బ్లూకోర్ట్ సిబ్బంది జయపాల్ అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ ని తన భూజాలపై వేసుకొని పొలాల గట్ల వెంబడి 2 కిలోమీటర్ల మోసుకొని గ్రామంలోకి వెళ్ళాడు.
జమ్మికుంట ఆసుపత్రి కి తరలించగా సురేష్ కి చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.