జూన్ 4న బీఆర్ఎస్ దుకాణం బంద్
అందుకే కేసీఆర్ వ్యవస్థాపక దినోత్సవానికి దూరమైండు
6 గ్యారంటీలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు చేస్తారా?
విజ్ఝులైన ప్రజాలారా… ఆలోచించండి
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి క్రిష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అక్రమంగా ఏపీకి దోచిపెట్టిన నేతలు కూడా నీటి జలాల పంపిణీపై మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. జనం నవ్వుకుంటారనే సొయి కూడా లేకుండా అపర మేధావి మాట్లాడుతున్నడు. గోదావరి, క్రిష్ణా జలాలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత కూడా బీఆర్ఎస్ నేతలకు లేదు. మనకు రావాల్సిన నీళ్లను ఏపీకి దోచిపెట్టారు. కమీషన్లకు కక్కుర్తి పడి కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నయి. మొన్న కాళేశ్వరం.. ఇయాళ పెద్దపల్లి ఓడేడు బ్రిడ్జీ ఇందుకు నిదర్శనం.. బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు, మోసాల పట్ల ప్రజలు విసిగిపోయారు. ఆ పార్టీ నేతలు ఎన్ని మొసలి కన్నీరు కార్చినా, పొర్లు దండాలు పెట్టినా, బస్ యాత్ర కాదు కదా…. మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మే పరిస్థితి లేదు. జనమే సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ ను నమ్మడం లేదు. ఈ విషయం కేసీఆర్ కు తెలుసుకాబట్టే ఈనెల 27న బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించడం లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచార సభలకే కార్యకర్తలు రావడం లేదు… ఇగ ఆ కార్యక్రమానికి ఎవరు రారని తెలిసే వ్యవస్థాపక దినోత్సవానికి దూరంగా ఉంటున్నారు. జూన్ 4న బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం తథ్యం.
కాంగ్రెస్ నేతలు టీవీల్లో బ్రేకింగ్ ల కోసం బీజేపీపైన, నాపైన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి పదవిలో ఉన్నామనే సోయి లేకుండా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ది. నేను ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని, ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నిస్తుంటే.. వ్యక్తిగత దూషణలు, బూతులు తిట్టడం ఎంత వరకు న్యాయమో విజ్ఝులైన ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి చిల్లర మల్లర ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. సంయమనం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతే ప్రజలు సమయం చూసి కర్రు కాల్చి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుని హుందాగా వ్యవహరించాల్సిన అవసరం రాజకీయ పార్టీల నేతలందరిపైనా ఉంది.