(పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్)
కరీంనగర్ , పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది .కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి వెలిశాల రాజేందర్రావు ,అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు . హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ పొన్నం ప్రభాకర్ కేటాయించేటప్పుడు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కి కరీంనగర్ ఎంపీ టిక్కెట్టు ఇస్తామని రేవంత్ రెడ్డి తో పాటు అధిష్టాన వర్గం హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది .కరీంనగర్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని , టిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను ఎదుర్కోవాలంటే వెలిశాల రాజేందర్ రావు లాంటి దీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆ పార్టీ రంగంలోకి దించింది . స్థానికుడైన కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాడు.
బిజెపి సైతం తమ పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాసును ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు . పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశి పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతున్నా అబ్బే అలాంటిదేమీ లేదు పెద్దపల్లి లోక్ సభ స్థానం కోసం మాజీ ఎంపీ డాక్టర్ సుగుణకుమారి , ప్రముఖ బిల్డర్ , మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాసులు పోటీ పడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అందిస్తున్న సమాచారం .పార్టీలో చేరేటప్పుడే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ కుమారుడు వంశీకి పెద్దపెల్లి ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు.
వంశీ కి టికెట్ ఇవ్వడం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఇష్టం లేదని , డాక్టర్ సుగుణ కుమారి లేదా ఆసంపల్లి శ్రీనివాసులకు టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి శ్రీధర్ బాబు సూచించారనే ప్రచారం ఇక్కడ జరుగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏడుపు ఏడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పెద్దపెల్లి ఎంపీ టికెట్ పై డిమాండ్ పెరిగింది.కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటే చాలు ఎంపీ అయినట్టే అన్న భావనతో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉన్నారు .ఇటు కరీంనగర్ ఎంపీ టికెట్ వెలిశాల రాజేందర్ రావు ,అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, పెద్దపెల్లి ఎంపీ టిక్కెట్ గడ్డం వంశీ, డాక్టర్ సుగుణ కుమారి , ఆసంపల్లి శ్రీనివాస్ లలో ఎవరిని కాంగ్రెస్ టికెట్ వరిస్తుందో ఒకటి , రెండు రోజులు వేచి చూడాల్సిందే .