అవినీతి అంతం.. మా పంతం..
దౌర్జన్యం చేసే వారిని వదిలిపెట్టం..
వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
భూకబ్జాదారులు దోపిడీదారులను ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టాలనీ, వారికి తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు. అవినీతిని అంతం చేస్తామని దోపిడిదారులు దౌర్జన్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కూడా చూస్తూ ఊరుకోవద్దని వారి తాట తీయాలని సూచించారు.
శుక్రవారం రాత్రి 1 వ డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిని అట్టేపు అంజలి ప్రభ, వేణుకు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో వెలిచాల రాజేందర్ రావు పాల్గొని ప్రసంగించారు. గత బిఆర్ఎస్ బిజెపి కార్పొరేటర్లు ఇష్టానుసారంగా దౌర్జన్యాలు భూకబ్జాలు చేసి కోట్లు సంపాదించారని ఆరోపించారు. అలాంటివారు మాయమాటలతో ప్రజలు మరోసారి మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ డివిజన్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ డివిజన్లో కార్పోరేటర్ గా వ్యవహరించిన వ్యక్తి ప్రజలను పీడించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేవారని ఆరోపించారు. అలాంటి వారిని మళ్లీ గెలిపించవద్దని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డివిజన్ ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. అవినీతి అంతం చేసేందుకు తాను ముందుంటానని దోపిడిదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళలు డివిజన్ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.