కరీంనగర్లో కాంగ్రెస్ బ్రహ్మాండమైన విజయం సాధించబోతుంది..
వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
వెలిచాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు..
బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ
కార్పొరేషన్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరొక గట్టి షాక్ తలిగింది. కోరుకోలేని దెబ్బ. కరుడుగట్టిన తెలంగాణ వాది బీఆర్ఎస్ స్థాపించిన అప్పటినుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు బండ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ ఎమ్మెల్యే కార్పొరేషన్ ఎన్నికల ఇన్చార్జి నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ గోపాల్ రెడ్డి తో మాజీ మున్సిపల్ గున్నాల రమేష్ మాజీ వార్డు మెంబర్ సీనియర్ నాయకులు తుమ్మ ప్రతాప్ రెడ్డి వినీత, పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరారు. వారందరికీ రాజేందర్ రెడ్డి, రాజేందర్రావు కండువాలు కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావ్ మాట్లాడుతూ కరీంనగర్లో రోజురోజుకు కాంగ్రెస్ ఆదరణ పెరిగిపోతున్నదని దీంతో బిఆర్ఎస్ బిజెపి నేతల్లో వణుకు మొదలైందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆపరేషన్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం కాంగ్రెస్ పార్టీ సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. నగర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కరీంనగర్ అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవు తుందని భావిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరామని బండ గోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చేరిన నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, జిల్లా రెడ్డీ సంఘం అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి డిసిసి ఉపాధ్యక్షుడు రాచకొండ ప్రభాకర్ మాజీ ఉపసర్పంచ్ ఎర్రం కనకా రెడ్డి కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ దుబ్బాని కుమార్ పొన్నం శ్రీనివాస్ యస్వాడ రాజ్ కుమార్ యూత్ కాంగ్రెస్ నాయకులు జేరిపోతుల వాసు గోనె రామస్వామి చింతల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.