తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సం దర్భంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ము గింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ కలిసి ఆయ న మాట్లాడారు.
ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా జూన్1, 2, 3తేదీల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వ హించనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ ఎస్ అని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు శాంతియుతంగా పోరా టంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువం టి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఆనాటి పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానమే తెలంగాణ రాష్ట్రం అ న్నారు.
నీళ్ళు, నిధులు, నియామకంపై జరి గిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం అని, అనేక అపవాదులు, అవమానాలు గురైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే తప్ప ఈ ప్రాంతానికి విముక్తి లేదని, అభివృద్ధి సాధించదని కేసీఆర్ పట్టుదలతో తెలంగా ణ నినాదాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే కాళేశ్వరం లాంటి బహుళార్థక నిర్మాణం జరిగేది కాద ని, తెలంగాణలో 24గంటల కరెంటు వాడి నం అంటే తెలంగాణ ఉద్యమ విజయమ న్నారు.
రైతాంగం మూడు కోట్ల 20లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించామంటే తెలంగాణ ఉద్యమేమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తు న్న సందర్భంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యం లో ముగింపు వేడుకలు జూన్ 1వ తేదీ నాడు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్దగల అమరజ్యోతి వరకు సాయంత్రం 7గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, రాష్ట్ర సాధనలో ప్రాణా లు త్యాగం చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘననివాళి అర్పిస్తారన్నారు.
తెలంగాణ ఆవిర్భావ జూన్ 2న ముగింపు వేడుకల సభను తెలంగాణ భవన్‌లో బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వ హించనున్నట్టు తెలిపారు. అదేరోజు హైద రాబాద్‌లో పలు దవాఖానాలలో అనాథ శరణాలయాలలో పార్టీ ఆధ్వర్యంలో పం డ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వ హించనున్నట్టు పేర్కొన్నారు.
జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహించి పార్టీ జెండాను, జాతీయ జెండాను ఆవిష్క రించి స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారని వివరించారు. ఈ చారిత్రక సందర్భంలో ద శాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వ హించాలని పార్టీ శ్రేణులకు కొప్పుల ఈశ్వ ర్ పిలుపునిచ్చారు.