హైదరాబాద్ : జవహర్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లి ఎయిడెడ్ హౌజింగ్ సొసైటీ (జెఎన్ ఎంఎహెచ్ అధ్యక్షులుగా బొమ్మగాని కిరణ్ కుమార్ (ప్రజాపక్షం), ఉపాధ్యక్షులుగా ఆర్.రవికాంత్ (ది హిందూ), కార్యదర్శిగా ఎన్.వంశీ శ్రీనివాస్(డెక్కన్ క్రానికల్ ) ఎన్నికయ్యారు. ఆదివారం సొసైటీకి జరిగిన ఎన్నికల్లో సభ్యులు ఐదుగురు డైరక్టర్లను ఎన్నుకోగా, సోమవారం వారు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే నూతనంగా ఎన్నికైన డైరక్టర్ల పదవీకాలాన్ని ఎన్నికల అధికారి లాటరీపద్దతిలో నిర్ణయించారు. ఇందులో పి.వి.రమణారావు ఐదేళ్ల పాటు, ఆర్.రవికాంత్ రెడ్డి నాలుగేళ్లు, ఎ.అశోక్ మూడేళ్లు, బొమ్మగాని కిరణ్ కుమార్ రెండేళ్లు, ఎన్.వంశీకృష్ణ ఒక సంవత్సరం పాటు డైరెక్టర్ల బాధ్యతలలో కొనసాగుతారు.