(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
తెలంగాణాలో జరిగే అతిపెద్ద, గిరిజన జాతర మేడారం సమ్మక్క- సారలమ్మల జాతర. రెండేళ్ల కోసారి జరిగే ఈ వనదేవ తల ఉత్సవాన్ని.. తెలంగాణ కుంభమేళగా కూడా పిలుస్తారు..
సుమారు 900 సంవత్స రాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపు కుంటున్నారు.
ఈ ఏడాది ఈ మహాజాతర జరగనుంది. ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరగబోతుంది. ప్రతి సంవత్సరం సమ్మక్క- సారలమ్మలను దర్శించు కునే భక్తుల సంఖ్య అంత కంతకూ పెరిగిపోయింది.. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుం టారు.
లక్షలు, కోట్లలో బారులు తీరుతున్న భక్తజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జాతరను నిర్వహిస్తోంది. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సమకూర్చుతుంది. ఈ క్రమంలో TSRTC భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సు లను ఏర్పాటు చేస్తుంది.
మేడారం జాతరకు భక్తుల రద్దీ దృష్ట్యా టీఎస్‌ఆర్టీసీ భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తుంది. ప్రతి డిపో నుండి వందల సంఖ్యలో మేడారం కు బస్సులను ఏర్పాటు చేస్తుంది. అలాగే 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగు తుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది. అలాగే, ఈ నెల-9 నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఎ.శ్రీధర్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దలకు రూ.750 పిల్లలకు రూ.450గా బస్సు ఛార్జీలను నిర్ణయించా మన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.