(పొలిటికల్ ఫ్యాక్టరీ – పెద్దపల్లి )
మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నేతలకే పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ నేతలు పెద్దపల్లిలో గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు . మాదిగల కు టికెట్ కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలకు వినతి పత్రాలు సమర్పించామని , అయినా కొన్ని పార్టీలు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికే టికెట్లు కేటాయించారని , కాంగ్రెస్ పార్టీ అయినా పెద్దపెల్లి ఎంపీ టికెట్ ను మాదిగలకు కేటాయించాలని , పెద్దపల్లి నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మూడు లక్షలకు పైగా ఉన్నాయని తమ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ మాదిగ ఐక్యవేదిక ఇన్చార్జి మామిడిపల్లి బాపయ్య , ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి రిసార్ట్స్ అధినేత , కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆసంపల్లి శ్రీనివాస్, కోటగిరి పాపన్న , కట్కూరి సందీప్ ,పెరక శంకర్ , రాజయ్య , చిలుక తిరుపతి , పులిపాక రీనా, బుష్పాక సంతోష్ మహారాజ్, గాజుల శ్రీనివాస్ , రామిళ్ళ బాపు , రేగుంట సునీల్ ,రామగిరి శ్రీపతి, మంతెన మల్లేష్,బుల్లి బాబన్న, ఎర్ర రమేష్, జి లింగన్న ,ఎం శ్రావణ్ ,కే అశోక్, కల్లెపల్లి అశోక్, న్యాతరి ప్రభాకర్ , ఆరేపల్లి శ్యాంసుందర్, ఎన్ దేవేందర్ , కాసిపేట సాగర్ , బూడిద తిరుపతి , గొట్టే రాజయ్య ,పల్లె సదయ్య, రీనా , లక్ష్మీ , కమల తదితరులు పాల్గొన్నారు.