పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రయత్నాలను ముమ్మరం చేసింది.బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఆ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.ప్రధాన ప్రతిపక్షమైన కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారు.ఇందులో భాగంగానే మాజీ మంత్రి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి,వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.చేవెళ్ల ఎంపీ టికెట్ హామీ ఇవ్వడంతో సునీతారెడ్డి కుటుంబం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైంది.తెలంగాణ పునర్నిర్మాణానికి సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీతారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి,ఆమె కుమారుడు రినీషారెడ్డి తమ అనుచరులతో కలిసి అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు.
శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ,సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని మహేందర్‌రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతారెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు.ఆమె గతంలో రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేసి ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు.2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు పట్నం కుటుంబం కాంగ్రెస్‌లో చేరాలని భావించినా,కేసీఆర్ వారిని పార్టీ లో
ఉండెందుకు ఒప్పించారు.ప్రస్తుతం సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.