(పొలిటికల్ ఫ్యాక్టరీ -కాళేశ్వరం )
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాళేశ్వరం లోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నాడు పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ప్రముఖ నిర్మాత, మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాస్, భూపాల్ పల్లి డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి , ధన్వాడ మాజీ సర్పంచ్ కారంగుల తిరుపతి గౌడ్ , బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తొట్ల తిరుపతి యాదవ్
తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు .