
– వందేళ్ల క్రితం ఎలా బాధపడ్డరో అలాగే బాధపడతున్నం
– మూడేళ్లుగా మమ్మల్ని తిట్టేది బ్రాహ్మణ సంఘానికి కనబడుతలేదా
– దుద్దిళ్ల శ్రీధర్ మారకపోతే బ్రాహ్మణ సంఘమే బాధ్యత వహించాలే
– మా ఓట్లతో గెలిచిండనే దుద్దిళ్ల కుటుంబాన్ని ప్రశ్నిస్తున్న
– సమాధానం చెప్పకుండా మావాళ్లతోనే తిట్టిపిస్తున్న ఎమ్మెల్యే
– రాజ్యాంగానికి తూట్లు పొడిచి అశాంతికి కారణమవుతున్న ఎమ్మెల్లే శ్రీధర్
– సోషల్ మీడయా పోస్టులపై రాష్ట్ర డీజీపీ..సీపీలకు ఫిర్యాదు చేశా
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
(పొలిటికల్ ఫ్యాక్టరీ – మంథని)
బ్రిటిష్ పాలన కంటే ఎక్కువగా నడుస్తున్న ఈ రాచరికపు పాలనలో మా తలరాతలు మారాలంటే ఎన్ని తరాలు మారాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు. సోమవారం మంథనిలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత మూడేళ్లుగా తన కుటుంబంపై సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ పెట్టిన పోస్టులపై రాష్ట్ర డీజీపీ, సీపీ, ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు జ్యోతిరావుపూలే బ్రాహ్మణ పాలనతో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ప్రస్తుతం తాము అదేరీతిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వందేళ్లనాటి కాలం మళ్లీ పునరావృతం అవుతోందన్నారు. మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్ వచ్చిన రెండేళ్లతో పాటు అంతకు ముందు ఏడాదిగా తమ తన బార్య, కూతురుతో పాటు తనపై సోషల్ మీడియా వేదికగా దుర్బాషలాడుతున్నారని అన్నారు. పన్నూరోడు రాస్తే అడవిశ్రీరాంపూరోడు పోస్టులు పెడుతూ తమ కుటుంబాన్ని తిడుతున్నారని ఆయన అన్నారు. తాను ఆనాడు బీసీ సామాజికవర్గం నుంచి ఎదిగిన బిడ్డగా చట్టం చూసుకుంటుందని ఓపిక పట్టానని, కానీ రోజురోజుకు వారి ఆగడాలు మితిమీరుతున్నాయని అన్నారు. అయితే రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే శ్రీధర్ తన వైఖరి మార్చుకుంటాడని, మా సామాజికవర్గం వాళ్లని తనపైకి ఉసిగొల్పడంలో చొరవచూపడని అనుకున్నానని, కానీ మా వాళ్లే నా ఇంటిపైకి వచ్చి చంపేందుకు చూశారని ఆయన వాపోయారు. తనపై ఇంత కక్ష్య కుట్రలు ఎందుకని ప్రశ్నించారు. తాను పేదలకు సేవ చేసినందుకా, ఆడబిడ్డలకు పెండ్లిళ్లు చేసినందుకా..గరీబు బిడ్డలకు చదువుచెప్పించినందుకా అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావుపూలేను అర్థం చేసుకున్న కనుకనే మా వాళ్ల మీదకు గొడవకు పోవడం లేదన్నారు. కానీ ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ను ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా తిట్టిపించడం ఎంతవరకు సమంజసమన్నారు. తాము దుద్దళ్ల కుటుంబాన్ని తిడితే హైదరాబాద్‌లోని షోకాల్డ్ బ్రాహ్మణ సంఘం స్పందించి హైదరాబాద్ సోషల్ మీడియా గ్రూపుల్లో తనపై పోస్టులు పెడుతున్నారని, మాజీ సీఏం కేసీఆర్, కేటీఆర్‌లు స్పందించాలని, తనను దూరం పెట్టాలంటూ పోస్టులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తనను, తన కుటుంబాన్ని మూడేళ్లుగా తిడుతూ పెడుతున్న పోస్టులు బ్రాహ్మణ సంఘానికి కనబడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఏనాడు బ్రాహ్మణులను కించపర్చలేదని, ప్రజల ఓట్లతోగెలిచిన ప్రజాప్రతినిధిని ప్రజాస్వామ్యబద్దంగా ప్రశ్నిస్తున్నానని ఆయన అన్నారు.చిత్తశుద్ది ఉంటే వాటికి సమాధానం చెప్పాలే కానీ తన సామాజికవర్గ వాళ్లతో తిట్టిస్తున్న తీరుపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాలంలో ఇద్దరికైనా ఇండ్లు కట్టించారా, నలుగురికి ఉద్యోగాలు ఇప్పించారా, ఒక్క ఇండస్త్రీ తీసుకువచ్చారా అని మంథని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే బ్రాహ్మణ సంఘం స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై తన కుటుంబంపై బూతులు పెడుతున్నా వాటిని ఎందుకు కంట్రోల్ చేయడం లేదన్నారు. 80శాతం పైబడి ఉన్న మా సామాజికవర్గ ప్రజలు ఓట్లేస్తే 40ఏండ్లుగా అధికారంలో ఉంటూ ఈ ప్రాంతాన్ని చీకట్లో ఉంచుతున్న విషయం మీకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. తమతో ఎంతో మంది బ్రాహ్మణ సామాజికవర్గ నాయకులు కలిసి పని చేస్తున్నారని, హైదరాబాద్ కేంద్రంగా మమ్మల్ని భయపెట్టాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే భయపడనని, ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు దుద్దిళ్ల శ్రీధర్ మెడలు వంచే వరకు పోరాటం చేస్తానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఇప్పటికైనా బ్రాహ్మణ సంఘం నాయకులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ను కంట్రోల్ చేయాలని, లేదంటే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.తనను, తన కుటుంబంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై రాష్ట్ర డీజీపీ, సీపీ, ఎస్పీలకు రిజిష్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని, మంథని నియోజకవర్గ వర్గంలో అశాంతిని నెలకొల్పేందుకు దుద్దిళ్ల శ్రీధర్ ప్రయత్నం చేస్తున్నాడని, ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి పదవిలో కొనసాగుతున్నాడో ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచి అశాంతికి కారణమవుతున్నాడని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.