బీజేపీకి ఓటేద్దాం…. భవిష్యత్తుకు బాటలేద్దాం
బండి సంజయ్ ను గెలుపు కోసం రిటైర్డ్ ఉద్యోగుల ప్రచారం
రిటైర్డ్ ఉద్యోగులు రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన బండి
‘‘దేశాన్ని రక్షించేటోడు… మోడీ. పిలిస్తే పలికేటోడు… బండి బీజేపీని గెలిపిద్దాం… భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం’’ అంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు వినూత్న రీతిలో ప్రచారం ప్రారంభించారు. దేశానికి నరేంద్ర మోదీ చేసిన అభివ్రుద్ధి, దేశ ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ చేసిన అభివ్రుద్ధితోపాటు ప్రజల పక్షాన చేసిన పోరాటాలతో రిటైర్డు ఉద్యోగులు కరపత్రం రూపొందించారు. ఈరోజు ఉదయం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉపాధ్యాయుడు ఎడమ సత్యనారాయణ రెడ్డి, రిటైర్డ్ ఎస్ఐ లాల మురళి తదితరులు పాల్గొన్నారు.. మరోవైపు కరపత్రంలో ఏయే అంశాలను పొందుపరిచారంటే… అందులోని ముఖ్యాంశాలు.
‘‘వచ్చేనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇవ్వబోయే తీర్పుపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఎందుకంటే.. భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్న నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ఒకవైపు…. కుటుంబ పాలన, అవినీతి, వారసత్వ రాజకీయాలతో దేశాన్ని తిరోగమనంవైపు నడిపించే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కూటమి ఒకవైపు నిలబడ్డాయి… దేశ రక్షణ, ధర్మరక్షణ, అభివ్రుద్ధి, ప్రజా సంక్షేమం కోరుకునే కరీంనగర్ ప్రజలు ఎటువైపు నిలబడాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది.
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే పేదలకు అంకితం కావాలని సంకల్పం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారు ‘‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’’ స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో మార్పు కోసం నిరంతరం కష్టపడుతున్నారు. మోదీగారి పాలనలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు. దళారుల ప్రమేయం లేకుండా దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలను నేరుగా పేదలు, రైతులు, మహిళలు, యువ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ప్రతి గ్రామానికి కరెంటు, ఇంటింటికీ నల్లా నీరు చేరుతోంది. ఆయుష్మాన్ యోజన, జన్ ఔషధి కేంద్రం కోట్లాది మందికి వరంలా మారాయి. 4 కోట్ల మంది పేదలకు ఇండ్లు కట్టించారు. 30 లక్షలకుపైగా మరుగుదొడ్లు నిర్మించారు.
అట్లాగే 100 శాతం పల్లెలకు రోడ్లు, బ్యాంకు అకౌంట్లు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించాలనే సంకల్పం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రతో పరిపూర్ణమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్, ఆత్మనిర్భర్ భారత్ వంటి అభివృద్ధి పథకాలు 140 కోట్ల మంది ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చింది. కాంగ్రెస్ కుటుంబ పాలనలో దేశం కుంభకోణాల్లో ఇరుక్కుని, ఆర్థికంగా చితికిపోయిన దశలో మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక విప్లవాత్మక నిర్ణయాలతో మోదీ ప్రభుత్వానికి విశ్వసనీయత పెరిగింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం 5 వందల ఏళ్ల హిందువుల చిరకాల వాంఛను నెరవేర్చిన మహానుభావుడు నరేంద్రమోదీ గారు. 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్య్రం అందించిన నాయకుడు. ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళల సంకెళ్లను తెంచి స్వేచ్ఛను అందించిన నేత. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను కల్పించే దిశగా బిల్లును ఆమోదించిన మహనీయుడు. చంద్రయాన్-3 ద్వారా చందమామపై భారత త్రివర్ణ పతాకాన్ని గగన వీధుల్లో ఎగురవేసిన యోధుడు, G-20 సమావేశాలకు అధ్యక్షత వహించి విజయవంతంగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన లీడర్.
ఇక కరీంనగర్ పార్లమెంట్ విషయానికొస్తే… బండి సంజయ్ కుమార్ ను ఎంపీగా ఎన్నుకున్న నాటి నుంచి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి 12 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు తీసుకొచ్చారు. శాతవాహన యూనివర్శిటీకి 12 బి, ఎస్సారార్ కళాశాలకు అటానమస్ హోదా తీసుకొచ్చిన ఘనత కూడా బండి సంజయ్ దే.. కోవిడ్ మహమ్మారి సమయంలో బయటకు అడుగు పెట్టడానికి కూడా లీడర్లు భయపడితే ఆసుపత్రులకు వెళ్లి కరోనా రోగులను పరామర్శించి వైద్యులకు, సిబ్బందికి భరోసా ఇచ్చిన ధైర్యవంతుడు బండి సంజయ్. మన ఓటుతో ఎంపీగా ఎన్నుకుంటే ఆ ఓటుకే విలువ తెచ్చిన నాయకుడు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగి ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేసిన ధీరుడు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఎండనక, వాననక, చలి అనక రాష్ట్రమంతా 150 రోజులపాటు 16 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాల్లో పాలు పంచుకుని అండగా నిలిచిన నాయకుడు బండి సంజయ్ గారు… రైతుల కోసం రాళ్ల దెబ్బలు తిన్నారు.. విద్యార్థుల కోసం లాఠీ దెబ్బలు తిన్నారు.. మహిళా సమస్యలపై తిరుగుబావుటా ఎగరేశారు.. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన జైలుకు వెళ్లిన నాయకుడు.. ఒకటి కాదు, రెండు కాదు… ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు ఏకంగా 100కుపైగా కేసులు పెట్టినా, దాడులు చేసినా భయపడకుండా కేసీఆర్ గడీల పాలనపై గళమెత్తిన ధీరుడు బండి సంజయ్ గారు మన కరీంనగర్ గడ్డపై పుట్టిన బిడ్డ కావడం మనందరికీ గర్వ కారణం.
అంతేగాకుండా దేశం కోసం, ధర్మం కోసం కుటుంబానికి దూరమై రాత్రింబవళ్లు కష్టపడుతున్న బండి సంజయ్ గారిపై కొందరు కావాలనే కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులేమీ తేలేదని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దేశంలో మోదీ గారిపైన, కరీంనగర్ లో బండి సంజయ్ గారిపై జరుగుతున్న అబద్దాల ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. దేశ హితం కోసం, కరీంనగర్ ప్రజలకోసం కేంద్రంలో మూడవసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా, మోడీ సైనికుడుగా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని ఎంపీగా బంపర్ మెజారిటీతో గెలిపించుకుందాం.
పిలిస్తే పలికేటోడు… ఆపదొస్తే ఆదుకునేటోడు.. కష్టమొస్తే అండగా ఉండేటోడు…పోరాటమే ఊపిరిగా బతుకుతున్నోడు.. హిందూ ధర్మరక్షణ కోసం ముందుండి పోరాటం చేసేటోడు బండి సంజయ్. దేశాన్ని రక్షించేటోడు. భరత మాతను విశ్వగురు స్థానంలో నిలబెట్టేటోడు మోడీ. బీజేపీకి ఓటే వేయడం ద్వారా ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఎన్నుకునే మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకుందాం.