(పొలిటికల్ ఫ్యాక్టరీ — పెద్దపల్లి )
ఎన్నికల ముందు చెప్పిన మాయమాటలను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్ పార్ల మెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో సాగునీరు అందక ఎండుతున్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. పెద్దపల్లి బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అధ్య క్షతన జిల్లా పార్టీ కార్యాల యంలో శనివారం 36 గంటల నిరసన దీక్షను కొప్పుల ప్రారంభించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ
రైతులకు సాగు నీరందక సుమారు 20లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయని తెలిపా రు. ఎండిన పంటలను చూసి రైతులు కంట కన్నీరు పెడుతున్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించట్లేదా.. అని నిలదీశారు. పంటలు ఎండుతున్నా సాగునీరు సరిపడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తక్షణమే పంటలకు సాగు నీరందిం చాలని, ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాల ని డిమాండ్ చేశారు. రైతు గోసను పట్టించుకోని కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎండిన పంట లను పరిశీలించామని, పెద్దపల్లి జిల్లాలో వెల ఎకరాలలో పంటలు ఎండి పోయాయని, రైతులకు భరోసా కల్పించి అండగా నిలిచేందుకే రైతులు నిర సన దీక్షను చేపట్టినట్లు పేర్కొన్నారు.
తమ దీక్షతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు అధైర్య పడవద్దని, బీఆర్ ఎస్ పార్టీ ఎళ్లవేళలా అండ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పర్యటించి ఎండిన పంటలను పరిశీ లిస్తారని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ కుంటే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుంద ని తెలిపారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరు కునేది లేదని ప్రభు త్వాన్ని హెచ్చరించారు.