ముఖ్యమంత్రిని కలిసి నాయకుల అభినందనలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం లభించింది. రాష్ట్రంలోని దాదాపు 90 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా “హస్తం” హవా కొనసాగిందని పార్టీ నాయకులు తెలిపారు._
ఈ సందర్భంగా *రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి , నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కూచుకుల్ల రాజేష్ రెడ్డి , రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేన రెడ్డి కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నందుకు నాయకులను అభినందించారు.
మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
అవసరమైన సహకారం తాను ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు._
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ,అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాల అమలులో మరింత కట్టుబాటుతో ముందుకు సాగుతామని నాయకులు తెలిపారు