6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా
డేట్, టైం, వేదిక మీరే నిర్ణయించండి…
నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా?
కేసీఆర్.. అన్య మతస్తుల ముందు అక్షింతలు, ప్రసాదాన్ని హేళన చేస్తావా?
కుహానా లౌకిక వాదులారా… మీ నోళ్లు ఎందుకు మూతపడ్డయ్?
హిందుగాళ్లు..బొందుగాళ్లంటే నీ పార్టీని బొందపెట్టిన చరిత్ర కరీంనగర్ ప్రజలది
దేవుడిని నమ్మని నీ కొడుకును గుడిమెట్ల ముందు మోకరిల్లేలా చేసిన చరిత్ర హిందువులది
అసలు శ్రీరాముడంటే మీకెందుకంత కసి?
బీఆర్ఎస్ ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డ బండి సంజయ్
సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు
రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఇరు పార్టీల నేతల డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగుల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు బండి సవాల్ విసిరారు. ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.. అయినా వాటిని అమలు చేసినట్లు పచ్చి అబద్దాలాడుతున్నరు. నేను మీకు సవాల్ చేస్తున్నా. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే నేను ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటా. అవసరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమే. నిరూపించకపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుండి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్ తోపాటు తెలంగాణ ఉద్యమకారులు కుమార్ తదితరులు తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయా నేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్ లతో కలిసి మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. ముఖ్యాంశాలు….
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే సోదరుడు, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కోడూరు మహేందర్ గౌడ్, మెతుకు భాస్కర్, చామనపల్లి సురేందర్ సహా పలువురు పర్టీలో చేరడం సంతోషంగా ఉంది. వారందరికీ బీజేపీ పక్షాన సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.
దేశంలోని అన్ని మతాలు, వర్గాలను సమానంగా చూడాలన్నదే బీజేపీ విధానం. కానీ బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటు. ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని, హిందూ సంస్ర్కతి, సాంప్రదాయాలను కించపరుస్తారా? అసలు వీళ్లు హిందువులేనా?…
మాట్లాడితే అయోధ్య అక్షింతలను కించపరుస్తున్నరు. అసలు రాముడంటే ఎందుకంత కసి? రాముల వారి అక్షింతలను, ప్రసాదాన్ని కూడా కించపరుస్తారా? ఒకాయన రేషన్ బియ్యం అంటారు.. నిన్న కేసీఆర్ ‘అక్షింతలు పంచితే, తీర్ధ ప్రసాదాలు పంచితే కడుపు నిండుతదా? కరెంట్, నీళ్లు వస్తయా? అంటున్నడు… జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో.. నీ బూతు(నమస్తే తెలంగాణ) పేపర్ లో కేసీఆర్ నిఖార్సైన హిందువుని నిలువెత్తు బొమ్మ వేయించుకుని ఓట్లడిగినవ్. మరి ఆనాడు పంచిన అక్షింతలు ఏమిటి? ఆనాడు నువ్వు పంచిన ప్రసాదమేంది? మీరు కలిపితేనే అక్షింతలు, మీరు పంచిందే ప్రసాదమా? ఇతరులు అదే పని చేస్తే తప్పా? ఇతర మతస్తుల ముందు మన మతాన్ని కించపరుస్తవా? నీలాంటోడా దేశ ప్రధాని అయితే.. పాకిస్తాన్ లో టోపీలను చూసి భారత్ ను కూడా పాకిస్తాన్ లో కలుపుతానంటాడేమో…
గతంలో హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే కరీంనగరోళ్లు నీ పార్టీని బొందపెట్టిర్రు.. దేవుడిని నమ్మని నీ కొడుకు ఇట్లనే దేవుడిని కించపర్చేలా మాట్లాడితే.. అహంకారాన్ని దించి గుడి మెట్ల ముందు మోకరిల్లేలా చేసిన చరిత్ర హిందువులది. ఇప్పుడు నీ వంతు వచ్చినట్లుంది… ప్రజలందరూ కలిసి పంచుకున్న అక్షింతలు, ప్రసాదాన్ని కించపరుస్తవా? కుహాన లౌకిక వాదులారా… హిందూ మతాన్ని, దేవుడి అక్షింతలు, ప్రసాదాన్ని చులకన చేస్తుంటే మీరెందుకు స్పందించడం లేదు?
ఇదంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొలిటికల్ డ్రామాలాడుతున్నరు.. ఒకాయన పంద్రాగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని అంటుంటే… ఇంకోకాయన సాధ్యం కాదు… రాజీనామా చేస్తానని మీడియాలో బ్రేకింగుల కోసం ఇద్దరూ కలిసి డ్రామాలాడుతూ 6 గ్యారంటీలపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నరు…
వాళ్లిద్దరికీ నేను సవాల్ చేస్తున్నా… అసెంబ్లీ ఎన్నికల్లో వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నరు. మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మోసం చేశారు.. ఇప్పుడేమో 6 గ్యారంటీలను అమలు చేశామని అబద్దాలాడుతున్నరు… మీరు 1. మహిళలకు తులం బంగారం, స్కూటీతోపాటు నెలనెలా రూ.2500 బ్యాంకులో జమ చేసినట్లు, 2. ఆసరా పెన్షన్లను రూ. 4వేలు ఇస్తున్నట్లు 3. ఇల్లులేనోళ్లకు జాగా, రూ.5 లక్షలిస్తున్నట్లు, 4.రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇచ్చినట్లు 5. రుజువు చేస్తే నేను పోటీ నుండి తప్పుకునేందుకు నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే 17 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులంతా పోటీ నుండి తప్పుకుంటారా?… ఈ సవాల్ కు స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అభ్యర్థుల ఉప సంహరణకు ఎల్లుండి చివరి తేదీ. ఆలోపు నిరూపిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటా.. ఎన్నికల్లోపు నిరూపించినా సరే.. నేనే స్వయంగా కాంగ్రెస్ అభ్యర్ది తరపున ప్రచారం చేస్తా… దమ్ముంటే నా సవాల్ కు స్పందించాలి… మీకు నిజంగా బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా మేనిఫెస్టో పవిత్రమైనదైతే… ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే నా సవాల్ ను స్వీకరించాలి. ప్రజల ముందు ఆధారాలతోసహా నిరూపించాలి. డేట్, టైం, వేదిక మీరే డిసైడ్ చేయండి. అమర వీరుల స్థూపం వద్దకైనా వస్తా… సర్దార్ పటేల్ విగ్రహం వద్దకైనా..భాగ్యనగర్ అమ్మవారి ఆలయం వద్దకైనా సరే… ఎక్కడికైనా వచ్చేందుకు నేను సిద్దం.