By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: మజ్లిస్ తో కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > మజ్లిస్ తో కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం
NewsPolitical NewsTelangana

మజ్లిస్ తో కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం

Last updated: 2026/01/23
Published January 23, 2026 News Political News Telangana
Share
SHARE

మతం పేరుతో కుట్రలు చేయాలనుకుంటున్నారు
అభివ్రుద్దితో కరీంనగర్ రూపురేఖలు మార్చాలనే తపన మాది
మేయర్ పీఠాన్ని అప్పగిస్తే అభివ్రుద్ధి చేసి చూపిస్తాం
గెలిచే చోట బీజేపీ కార్యకర్తలకే టిక్కెట్లు ఇస్తాం
సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టిక్కెట్లు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
సంజయ్ సమక్షంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతల చేరిక

(పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్)

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మజ్లిస్ లో ఒక వర్గం నేతలతో కాంగ్రెస్, మరో వర్గంతో బీఆర్ఎస్ నేతలు ఒప్పందం కుదుర్చుకుని మతం పేరుతో కుట్రలు చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. తాము మాత్రం అభివ్రుద్ధి మంత్రంతోనే ప్రజల్లోకి వెళుతున్నామని స్పష్టం చేశారు. కేంద్ర నిధులతోనే కరీంనగర్ లో అభివ్రుద్ధి పనులు సాగుతున్నాయని, బీజేపీని గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ రూపురేఖలు మారుస్తానని చెప్పారు. పొరపాటున ఇతర పార్టీలకు ఓట్లేస్తే అభివ్రుద్ధి పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈరోజు సాయంత్రం క46వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత వెంకట్ రెడ్డి ఆధ్వర్వంలో పలువురు కాంగ్రెస్ నేతలతోపాటు బీఆర్ఎస్ కు సంబంధించి 10వ డివిజన్ కు చెందిన సాగాని కొమరయ్య సార్, 30వ డివిజన్ కు చెందిన నక్క రాజేశ్వరరావు, 48వ డివిజన్ కు చెందిన కర్రి అనిల్ కుమార్, 4వ డివిజన్ కు చెందిన దుర్శేడు మురళి, 47వ డివిజన్ కు చెందిన శ్రీరాం నరేందర్ లు తమ వందలాది మంది అనుచరులతో వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. కరీంనగర్ ఎంపీ కార్యాయలంలో కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ కార్యక్రమంలో బండి సంజయ్ వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ కాషాయ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు ఓదెలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలను, కరీంనగర్ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. ఏమన్నారంటే…


నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్ లో జరిగిన అభివ్రుద్ధిని చూసి, బీజేపీ సిద్దాంతాలు నచ్చి బీజేపీలో చేరుతున్న నాయకులకు స్వాగతం. కరీంనగర్ అభివ్రుద్ధి చెందిందంటే కేంద్ర నిధులే ప్రధాన కారణం. అభివ్రుద్దే లక్ష్యంగా, అభివ్రుద్దే మంత్రంగా బీజేపీ ఎన్నికల్లోకి వెళుతున్నాం. బీజేపీ అభ్యర్థులను గెలిపించి కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీకి అప్పగిస్తే అత్యధిక నిధులు తెచ్చి మరింత అభివ్రుద్ధి చేస్తాం. లేకుంటే అభివ్రుద్ధి పనులు ఆగే ప్రమాదముంది.పనులు ఆగొద్దంటే కేంద్ర నిధులే శరణ్యం. కరీంనగర్ ను అభివ్రుద్ధి చేయాలనే తపన మాలో ఉంది.

సర్వే ఆధారంగా టిక్కెట్లు ఇస్తాం. బీజేపీ కార్యకర్తలు గెలిచే అవకాశాలు ఉన్న చోట వాళ్లకే టిక్కెట్లు ఇస్తాం… అక్కడ గెలిచే అవకాశం. కార్యకర్తలు గెలిచే అవకాశం లేనిచోట సర్వే నిర్వహించి ఇతరులకు టిక్కెట్లు ఇస్తాం. అందుకోసం త్రిసభ్య కమిటీ వేశాం. వాళ్లే ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటారు.

మేం అభివ్రుద్ధితో వస్తున్నాం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో కలిసి మతతత్వంతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకుంటున్నాయి. వాస్తవాలు గుర్తించాలి. పార్టీలో చేరిన నేతలంతా కష్టపడి పనిచేయండి. ప్రజల మన్ననలు పొందండి. కరీంనగర్ రూపురేఖలను మార్చాలనే తపనతో ఉన్నాం. ప్లాన్ రడీగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ కలిసి లోపాయికారీ ఒప్పందంతో మతం పేరుతో బీజేపీని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. ఎవరు వచ్చినా బీజేపీ గెలుపు ఆప తరం కాదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article చెన్నూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి*
Next Article కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేనేలేదు
- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?