అన్ని అంశాలు పరిశీలిస్తానని సీఎం రేవంత్ హామీ
జేఎన్జే సొసైటీకి భూమి అప్పగింతపై మీడియా అకాడమీ చైర్మన్ తో రిపోర్టు
ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కి కేటాయించిన భూములలో కబ్జా అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జేఎన్జే సొసైటీకి భూమి అప్పగింతపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తో రిపోర్టు తెప్పించుకుంటానని అన్నారు ..మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా కొందరు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.. తాజాగా హైదరాబాదులోని పెట్ బషీరాబాద్ లో జర్నలిస్టుల స్థలాలపై పెట్టిన సైన్ బోర్డులను కొందరు భూకబ్జాదారులు అక్రమంగా తీసేసారని విలేకరులు అడగడంతో దీనిపైన పరిశీలన చేస్తానని, రిపోర్ట్ కూడా తెప్పించుకొని తగు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు . కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటామని అన్నారు.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చిన హామీ ప్రకారంగా స్థలాలను ఇవ్వాలని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సానుకూలంగా స్పందించడంతో సొసైటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు..