(పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్ )
లిక్కర్ స్కాం నిందితుడు వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి బీజేపీకి రూ.500 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇవ్వగానే బెయిల్ వచ్చిందంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ కు, బెయిల్ కు సంబంధమేందని ప్రశ్నించింది. పొన్నం వ్యాఖ్యలు న్యాయ స్థానాన్నే అవమానించేలా ఉన్నాయని మండిపడింది. పొన్నం తీరును చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టినట్లుందని అనుమానం వ్యక్తం చేసింది. తక్షణమే ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గౌరవ న్యాయ స్థానం సైతం పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఎవరెన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ కుమార్ 4 నుండి 5 లక్షల బంపర్ మెజారిటీతో ఎంపీగా గెలిచి చరిత్ర స్రుష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేసింది…
ఈరోజు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, కుమ్మరి శంకర్, మధుకర్, రమణారెడ్డి తదితరులు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ఎస్ కుమార్ మాట్లాడుతూ… ‘‘కాంగ్రెస్ రాష్ట్ర నేతలు అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. చివరకు సుప్రీంకోర్టుపై కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ న్యాయ వ్యవస్థపై కూడా అభాండాలు మోపుతున్నారు.. తన స్థాయికి మించి బీజేపీ నేతలపై మాట్లాడుతున్నారు…బూతులు మాట్లాడితే, తిడితే పేరొస్తుందనుకుంటే పొరపాటు. బీఆర్ఎస్ నేతలు కూడా గతంలో ఇట్లనే మాట్లాడితే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో తెలుసుకోవాలి. కాంగ్రెస్ నేతలది కూడా బీఆర్ఎస్ యూనివర్శిటీలోనే చదువుకున్నట్లున్నారు.. లిక్కర్ స్కాంలో నిందితుడు శరత్ చంద్రారెడ్డి రూ.500 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చినందుకు ప్రతిఫలంగానే బెయిల్ వచ్చిందని పొన్నం మాట్లాడటం సిగ్గు చేటు. ఎలక్ట్రోరల్ బాండ్స్ కు, బెయిల్ కు సంబంధమేంది? పొన్నం వ్యాఖ్యలను న్యాయ వ్యవస్థ సీరియస్ గా తీసుకోవాలి… కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ 4 నుండి 5 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారని తేలడంతో పొన్నంకు భయం పట్టుకుంది. కాంగ్రెస్ నుండి అభ్యర్ధే కరువయ్యారు. ఈ ఆందోళనతోనే పొన్నం ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నరు…దేశంలో ఏ సర్వే చూసినా నరేంద్రమోదీ ప్రభుత్వానికి 400 సీట్లు వస్తాయని తేలడంతో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నరు.’’అని వ్యాఖ్యానించారు.
అనంతరం సంగప్ప మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా మంత్రి అయితే వారి గౌరవం పెరిగేలా వ్యవహరిస్తారు.. కానీ పొన్నం ప్రభాకర్ మాత్రం మంత్రి కాగానే తన స్థాయిని తానే తగ్గించుకునేలా మాట్లాడుతున్నరు. బీజేపీపైన, మోదీపైన, ఎంపీపైన అడ్డగోలుగా మాట్లాడుతున్నరు.. పొన్నం ప్రభాకర్… నీ స్థాయి ఏమిటో కరీంనగర్ ప్రజలను అడిగితే తెలుస్తుంది. కరీంనగర్ లో నీకు రాజకీయ భవిష్యత్తు లేదని తెలిసి.. హుస్నాబాద్ పారిపోయినవ్. నువ్వా ప్రధాని గురించి మాట్లాడేది. దేశ సేవ కోసం కుటుంబాన్ని పక్కన పెట్టిన మహానేత. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తావా? ఎలక్ట్రోరల్ బాండ్స్ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు వచ్చినయ్. రాజకీయాల్లో నల్లధనం ఉండకూడదనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం దేశ చరిత్రలోనే సంచలనమైన ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానాన్ని తీసుకొచ్చారు.. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ విధానం తీసుకొస్తే… నల్లధనంపై ఆధారపడ్డ కాంగ్రెస్ అల్లాడిపోయింది. డీజిల్ కు కూడా పైసల్లేవని గగ్గోలు పెడుతోంది… సుప్రీంకోర్టు ద్వారా శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది.. కానీ పొన్నం వ్యాఖ్యలు సుప్రీంకోర్టునే అవమానించినట్లున్నాయి. వెంటనే గౌరవ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. సుమోటోగా తీసుకుని పొన్నంపై చర్యలు తీసుకోవాలి. జైల్లో వేయాలి. బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత పొన్నం లేదు. నిజాయితీ రాజకీయాలకు, ప్రజాసేవకు నిదర్శనం బండి సంజయ్. మోదీ, బండి సంజయ్ లను విమర్శించడమంటే… ఆకాశంపై ఉమ్మేసినట్లే ఉంటుందని గుర్తుంచుకుని మాట్లాడాలి…ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇస్తే బెయిల్ ఎట్లా వస్తది? మీ ఇంట్లో లాయర్లు ఉన్నరు కదా… వెంటనే వెళ్లి తెలుసుకో… నాకు తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కు మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్లుంది. పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నరు. దయచేసి ట్రీట్ మెంట్ ఇవ్వాలని కోరుతున్నా…’’అని పేర్కొన్నారు.
గుగ్గిళ్ల రమేశ్ మాట్లాడుతూ… ‘‘బండి సంజయ్ చేసిన పోరాటాలవల్లే ఈరోజు కేసీఆర్ సర్కార్ ను ప్రజలు గద్దె దింపారు. గుడ్డిలో మెల్లగా పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చారు.. అంతే తప్ప గత ఐదేళ్లలో ఏనాడూ కాంగ్రెస్ కానీ, పొన్నం కానీ పోరాటాలు చేయలేదు… పైగా పొన్నం బీఆర్ఎస్ తో కుమ్కక్కై చీకటి ఒప్పందాలు చేసుకుని పనిచేస్తున్నారు.. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కాంగ్రెస్ నుండి డమ్మీ అభ్యర్ధిని నిలబెడుతున్నారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ 4 లక్షల బంపర్ మెజారిటీతో గెలవడం తథ్యం…’’అని పేర్కొన్నారు.