గద్వాల పట్టణంలోని 24వార్డులకు సంబంధించి అభ్యర్థుల మొదటి జాబితాను బిజెపి జిల్లా ఇంచార్జి బాబురెడ్డి విడుదల చేశారు.
3 బీసీ జనరల్ -G. పాండు.
4 SC మహిళ -S.రూబేక.
5 జనరల్ – G. నరసింహులు.
6 SC జనరల్ -శాలన్న.
7 జనరల్ -K.హరిశంకర్..
8 బీసీ మహిళ-జయలక్ష్మి.
9జనరల్ s. శ్రీమన్నారాయణ.
10 జనరల్ మహిల -A. శిల్ప.
14 జనరల్ -తిమ్మన్న.
15బీసీ మహిళ -లక్ష్మీ.
16 జనరల్ మహిళ- సమత .
17 జనరల్ -K. మానస.
18 బిసి మహిళ -K.అనురాధ.
19 బీసీ జనరల్ -టి. రామాంజనేయులు.
20 బీసీ మహిళ -K. మాధవి.
26జనరల్ మహిళ -టి. క్రిష్ణ వేణి.
28జనరల్ -అమర్నాథ్ .
31ఎస్సి మహిళ -జె. రుతమ్మ.
32జనరల్ మహిళ-సద్దల జ్యోతి.
33బిసి. మహిళ- బండల పద్మావతి.
34 బిసి. మహిళ- బండల రామలక్ష్మి.
35 జనరల్- వీర ప్రకాష్.
36.జనరల్ మహిళ-జయశ్రీ రజక.
37బీసీ మహిళ -S. మంజుల…
డొక్కు స్కూటర్ పై తిరిగి కోట్లకు పడగలెత్తిన సునీల్ రావు.
తెలంగాణలోని ఏ నేతకు లేని అధునాతన భవంతి కట్టుకున్నాడు..
వందల కోట్లు అక్రమంగా సంపాదించాడు సునీల్ రావు..
బిల్డింగ్ కట్టినా దుకాణం పెట్టినా.. అపార్ట్మెంట్ కట్టినా గల్లి గల్లి లో ఏ పని చేసినా దౌర్జన్యంగా కప్పం వసూలు చేసిన అక్రమార్కుడు.. నీచుడు.
మా తండ్రి జగపతిరావు దగ్గర శిష్యుడుగా ఉండి వెన్నుపోటు పొడిచాడు..
42వ డివిజన్ ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టండి.. బండకేసి కొట్టండి..
మళ్లీ కోల్కోకుండా చేయండి..
పట్టణ ప్రజలను పీక్కుతిన్న అత్యంత అవినీతిపరుడు సునీల్ రావు..
అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో స్థానం కల్పించకండి..
చిత్తు చిత్తుగా ఓడించండి..
డివిజన్ ను కాపాడుకోండి..
నిజాయితీపరుడు డాక్టర్ రాజన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించండి..
నాపై బాడీ షేవింగ్ చేస్తావా..
నీకు రాజకీయ విలువలు ఉన్నాయా..?
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఫైర్..
42 డివిజన్లో డాక్టర్ రాజన్న భారీ ర్యాలీ..
వందలాది మందితో నామినేషన్ దాఖలు..
( *పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్)
*
కరీంనగర్లో డొక్కు స్కూటర్ పై తిరిగిన మాజీ మేయర్ సునీల్ రావు వందల కోట్లు అక్రమంగా సంపాదించారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఫైర్ అయ్యారు. సునీల్ రావు వందల కోట్లు అక్రమంగా అర్జించి వందల కోట్లకు పడగలెత్తాడని మండిపడ్డారు. స్మార్ట్ సిటీ పేరిట వందల కోట్లు దోచుకొని తెలంగాణలో ఏ రాజకీయ నేత నిర్మించని విధంగా అధునాతన భవనాన్ని వందల కోట్లు పెట్టి నిర్మించుకున్నారని ఆరోపించారు.
శుక్రవారం కరీంనగర్ లోన్ 42వ డివిజన్ భగత్ నగర్ లో డాక్టర్ రాజన్న నామినేషన్ దాఖలు చేసేందుకు వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళల కోలాటాలు నృత్య ప్రదర్శనలు వందలాది మంది డివిజన్ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావ్ మాట్లాడుతూ సునీల్ రావు మేయర్ గా ఉన్న సమయంలో కరీంనగర్ ప్రజలను జలగలాగా పీకుతున్న అవినీతిపరుడు సునీల్ రావని ధ్వజమెత్తారు. ఆయన అవినీతి కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు అని ఈసారి డివిజన్ ప్రజలు కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి బండకేసి కొట్టాలని పిలుపునిచ్చారు. అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో స్థానం ఉంచవద్దని ప్రజలంతా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పేరిట వందల కోట్లు దోచుకొని నీతి వాక్యాలు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. సునీల్ రావ్ బాగోతాన్ని వీడియోలతో సహా నిజాయితీపరుడు మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు బయటపెట్టిన సునీల్ రావుకు సిగ్గు రాలేదని మండిపడ్డారు. కరీంనగర్ లో బిల్డింగ్ కట్టినా అపార్ట్మెంట్ కట్టినా దుకాణం పెట్టినా దౌర్జన్యంగా కప్పం వసూలు చేసిన అవినీతిపరుడు అక్రమార్కుడు సునీల్ రావని విమర్శించారు. ఇతరుల జేబులో చేతులు పెట్టి డబ్బులు లాక్కున్న గజదొంగ సునీల్ రావని ఆరోపించారు. 42వ డివిజన్లో కాంగ్రెస్ నుంచి డాక్టర్ రాజన్న పోటీ చేస్తుండడంతో సునీల్ రావులో వణుకు మొదలైందని ఓడిపోత ననే భయంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సునీల్ రావుకు డివిజన్ ప్రజలు కారు కాల్చి వాత పెట్టి బండకేసి కొట్టాలని అలాంటి వ్యక్తిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మళ్లీ గెలిస్తే సునీల్ రావు అవినీతి మరింత రెట్టింపు అవుతుందని ప్రజలంతా విషయం గుర్తు పెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆఫీసర్ గా పని చేసిన మంచి వ్యక్తి నిజాయితీపరుడు డాక్టర్ రాజన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నీతిగా నిజాయితీగా సేవలందిస్తారని రాజేందర్రావు పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతూ ఆరోపణలు చేయడం దారుణమని ఆయనకు రాజకీయ విలువలు లేవని ఎవరిని పడితే వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మా తండ్రి జగపతిరావు దగ్గర శిష్యుడిగా పనిచేసి మా కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. డివిజన్ ప్రజలు కూడా ఆయన నమ్మడం లేదని ఆయనకు ఓటమి భయం పట్టుకుందని రాజేందర్రావు పేర్కొన్నారు. కరీంనగర్ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో చిత్తుచిత్తుగా సునీల్ రావు ఓడిపోవుతున్నారని తెలిపారు. నీతిగా నిజాయితీగా వ్యవహరించే డాక్టర్ రాజన్నను అత్యధిక మెజార్టీతో ప్రజలంతా గెలిపించాలని కోరారు. అవినీతిపరుడు అక్రమార్కుడు సునీల్ రావు నుంచి డివిజన్ ను ప్రజలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజన్న గడ్డం విలాస్ రెడ్డి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ బట్టు వరప్రసాద్ కాంగ్రెస్ నాయకులు డివిజన్ ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.