భువనగిరి ఎంపీ బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ పేరును అధిష్టానం ప్రకటించింది. ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న నరసయ్య గౌడ్ ను రంగంలో దించితే గెలుపు ఈజీ అవుతుందని బీజేపీ నాయకత్వం భావించి మొదటి జాబితాలోనే బూర నర్సయ్య గౌడ్ పేరును ప్రకటించింది.
సూర్యాపేటకు చెందిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ 1959 మార్చి రెండవ తేదీన జన్మించారు. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాపరో ఎండోస్కోపిక్ సర్జరీ (HILS ) డైరెక్టర్ గా , ఆదిత్య హాస్పిటల్ , కేర్ హాస్పిటల్స్ లో కేవలందిస్తున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ 2009లో టిఆర్ఎస్ లో చేరారు . తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019లో తిరిగి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు . 2022లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. 20 24 ప్రస్తుతం జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా భువనగిరి నుంచి పోటీ చేస్తున్నారు .
తెలంగాణలోని 17 స్థానాలకు గాను ఆరు లోక్ సభ స్థానాలకు బిజెపి అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు బూర నర్సయ్య గౌడ్ పేరు ప్రకటించడం విశేషం. ఈయనతో పాటు చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థిగా డాక్టర్ వెంకటేశ్వరరావు పేరును బిజెపి ప్రకటించింది.