(పొలిటికల్ ఫ్యాక్టరీ – నిర్మల్ )
నిర్మల్ జిల్లాలోని తాటిగూడ గ్రామంలో విషాదం నెలకొం ది. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ నాలుగేండ్ల చిన్నారి చికిత్స పొందుతూ ఈరోజు ప్రాణాలు కోల్పో యింది. వివరాల్లోకి వెళ్తే.. తాటిగూడ గ్రామానికి చెందిన అమర్ సింగ్, సరిత దంపతులకు కూతురు భూక్యా శాన్వి(4) ఉంది. అయితే మార్చి 2వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న శాన్విపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ పాపకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది శాన్వి. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కుక్కలను తరిమేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు అమర్ సింగ్ మొర పెట్టుకున్నాడు. పెంబి మండల పరిధిలోని పలు గ్రామాల్లో కుక్కల దాడులు విపరీతంగా పెరిగి పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు..దీంతో పిల్లలు, వృద్ధుల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ కుక్కల బెడద అధికమైంది.చాలామంది వీధి కుక్కల బారినపడి ప్రాణాలు కోల్పోయారు . అయినా ప్రభుత్వంలో స్పందన లేదు .వీధి కుక్కల సమస్య చాలా పెద్దదైన ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విషయంలో లైట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది .ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వీధి కుక్కల విషయంలో సీరియస్ గా తీసుకొని వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.