భరోసా కల్పించిన సీఎం చంద్రబాబుమంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎస్.సవిత
( పొలిటికల్ ఫ్యాక్టరీ – అమరావతి )
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు భద్రత, భరోసా కల్పించారని రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామా నాయుడు, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎస్.సవిత సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తదుపరి పబ్లిసిటీ సెల్ లో ఈ ముగ్గురు మంత్రులు పాత్రికేయులతో మట్లాడుతూ ముఖ్యమంత్రి తొలి ఐదు సంతకాలతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, రైతులకు, వృద్దులు, వితంతువులు, వికలాంగులకు, నిరుపేదలకు భద్రత, భరోసా కల్పించారన్నారు.
తొలుత రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎన్నికల సందర్బంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 16,347 టీచర్ల పోస్టుల భర్తీకై డిఎస్సీని నిర్వహించే ఫైల్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు శ్రీకారం చుట్టారన్నారు. డిఎస్సీ నిర్వహిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందన్నారు. ప్రజల ఆస్తులకు అభద్రతను కల్పించే విధంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రెండో సంతకాన్ని చేశారన్నారు. దీని వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలకు వారి ఆస్తులపై పూర్తి భద్రత, భరోసా కల్పించడం జరిగిందన్నారు. సామాజిక భద్రత పథకం క్రింద వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రతి నెల ఇచ్చే ఫించనును కూడా రూ.3 వేల నుండి 4 వేలకు పెంచే ఫైల్ పై ముఖ్యమంత్రి మూడో సంతకం చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుండే ఈ పెంపును వర్తింప చేస్తూ ఏఫ్రిల్, మే, జూన్ మాసాలకు చెందిన రూ.3 వేలను కలుపుకుని జూలై మాసంలో మొత్తం రూ.7 వేలను వృద్దాప్యపు ఫించనుగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. వికలాంగులకు అయితే ప్రస్తుతం ఇచ్చే రూ.3 వేలను రూ.6 వేలకు పెంచడం జరింగిందన్నారు. జూలై 1 నుండి ఇళ్ల వద్దే ఫించన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తూ ముఖ్యమంత్రి నాలుగో సంతకం చేయడం జరిగిందన్నారు. ఉదయం టిఫిన్ రూ.5/-, మద్యాహ్న భోజనం రూ.5/- లకు మరియు రాత్రి భోజనం రూ.5/- లకు అందజేయడం జరుగుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు పర్చిన అమ్మ క్యాంటీన్లను నూతనంగా వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుంటే మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు. అదే విధంగా నిరుద్యోగ యువత అభిరుచికి అనుగుణంగా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగ, ఉపాధి అవకాశలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సస్ పథకాన్ని అమలు పర్చే ఫైల్ పై ముఖ్యమంత్రి ఐదో సంతకం చేసి నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించారని ప్రశంసించారు.
మరో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తమ పార్టీపై మంచి భరోసాతో పెద్ద ఎత్తున ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించారన్నారు. ప్రజల తమ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని ఏమాత్రము ఒమ్ము చేయకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. గత ముఖ్యమంత్రి ఫించనును రూ.2 వేల నుండి రూ. 3 వేలకు పెంచుతామని, పెంచిన రూ.1,000/- లకు సొమ్మును విడతలు వారీగా ఐదు ఏళ్లలో పెంచగా తమ ప్రభుత్వం ఒకే సారి రూ.1,000/- ను పెంచడమే కాకుండా ఏప్రిల్ నుండి అమల్లోకి తేవడం జరిగిందన్నారు.
మరో మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, విజన్ ఉన్న ముఖ్యమంత్రి పాలనతో రానున్న ఐదేళ్లు స్వర్ణయుగమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన వెంటనే ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మంచి భద్రత, భరోసా కల్పించారని ప్రశంసించారు.