* కామారెడ్డిలో బ్లాక్ మెయిల్ జర్నలిస్టుల హవా
*లక్షల్లో డబ్బులు డిమాండ్ , వసూళ్లు
* పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన వీరి దందా ఆగడం లేదు
* వసూల్ రాజాలా వేధింపులు తాళలేక ఓ మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య
* వ్యాపారులను , అధికారులను సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్న వైనం
* ఆర్టిఐ చట్టాన్ని ఆయుధంగా చేసుకొని దందా నడుపుతున్న వసూల్ రాజాలు!
హైదరాబాద్ : కామారెడ్డిలో జర్నలిజం ముసుగులో కొందరు వ్యక్తులు పలువురు వ్యాపారులు , అధికారులను , ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు .
కాసుల వేటలో పడి కొందరు వ్యక్తులు జర్నలిజం ముసుగులో అక్రమ దందాలు చేస్తూ జర్నలిజం వృత్తికే కళంకం తెస్తున్నారు .
పలువురు అధికారులు , ఉద్యోగులు , వ్యాపారులే కాకుండా అంబేద్కర్ సంఘం నాయకులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు .
జర్నలిజం ముసుగులో వసూళ్ల దందా నడుపుతున్న ముఠాకు చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఇందూరి సిద్ధ గౌడ్ అనే వ్యక్తి నాయకుడు .మాచారెడ్డి ఎక్స్ రోడ్ కు చెందిన కే బాబురావు అనే వ్యక్తి ఇతనికి ప్రధాన అనుచరుడు .
ప్రతిరోజు ఈ ముఠా సభ్యులు కామారెడ్డి కలెక్టరేట్లో మకాం వేసి ఆర్టిఐ చట్టం క్రింద దరఖాస్తులు చేయడం , వ్యాపారుల చిన్నచిన్న లొసుకులను బయటకు లాగడం , వారి నుంచి లక్షలాది రూపాయల డిమాండ్ చేస్తూ వసూలు చేయడం సిద్దా గౌడ్ ముఠా స్పెషాలిటీ !
ఒకవైపు మెడికల్ షాప్ నడుపుతూ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం నువ్వు చేస్తున్నామంటూ లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఒక మహిళను వేధించడంతో వీరి వేధింపులు తట్టుకోలేక సదరు మహిళ ఫార్మసిస్టు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం .
వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు సమాచారం .అయినా ఈ ముఠాపై చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు .
ఒక విద్యాసంస్థ అధినేతను లక్ష రూపాయలు ఇవ్వాలని వీరు బ్లాక్ మెయిల్ చేయడంతో సదరు సంస్థ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 2022 ఆగస్టు 25వ తేదీన వీరిపై కేసు (669/2022 ) నమోదు అయింది . దీనిపై కామారెడ్డి కోర్టులో కేసు నడుస్తుంది .
అసైన్డ్ భూములలో నిర్మాణం చేస్తున్నావని
మాచారెడ్డి మండలం గణపురం గ్రామానికి చెందిన ఒక దళితున్ని సైతం వీరు బెదిరించి లక్ష ఇరవై వేలు డిమాండ్ చేశారని సమాచారం . అయితే ఈ కేసులో కాంప్రమైజ్ అయినట్టు తెలిసింది .
ఈ ముఠా వసూళ్ల బాగోతానికి ఎవరైనా ఎదురు తిరిగితే ఈ ముఠా లో ఉన్న పదిమందిలో గల నలుగురు దళితుల్ని ఉసిగొల్పి ఎదురు తిరిగిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సమాచారం .
ఇందూరి సిద్ధ గౌడ్ , కే బాబురావులపై చర్యలు తీసుకోవాలంటూ , వారి అక్రిడిటేషన్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయాలంటూ తెలంగాణ స్టేట్ అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా నాయకులు కామారెడ్డి ప్రెస్ క్లబ్ నేతలకు గత తొమ్మిది నెలల క్రితమే ఫిర్యాదు చేశారు .
జర్నలిజం ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న సిద్దా గౌడ్ ,బాబురావులపై చర్యలు తీసుకోవాలని పలువురు వ్యాపారులు , ప్రజా సంఘాల నేతలు , బాధితులు కోరుతున్నారు .