
చిత్రం చిన్నదైనా దాని పరిధి పెద్దది . ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నది షార్ట్ ఫిలిమ్స్ ,వీడియో సాంగ్స్ మాత్రమే.
దేశంలో అలాంటి లఘు చిత్రాలకు అడ్డ తెలంగాణ మాత్రమే అని నిరూపించింది తెలంగాణ యువత.
తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ ను, లఘు చిత్రాలను చిన్నచూపు చూశాయి గత ప్రభుత్వాలు. కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న చిత్రాలకు పెద్దపీట వేసింది. తెలంగాణలో ఉన్న ప్రతిభావంతులకు పట్టం కట్టింది . వారి ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది .
ఒక అపురూపమైన ఘట్టానికి తెరలేపింది. అదే బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ చాలెంజ్ – 2025. దీంతో 40 ఏండ్ల లోపు గల యువ కెరటాల టాలెంటును బయటకు తీసింది. గ్రామీణం , పట్టణం అనే తేడా లేకుండా యువతి యువకులు ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో పాల్గొన్నారు .
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ -2025 కాంటెస్ట్ కోసం 500 లకు పైగా ఎంట్రీలు వచ్చాయి .
అందులోనుండి 219 లఘు చిత్రాలను మొదటి విడతలో ఎంపిక చేశారు .వీరందరినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చారు. డిసెంబర్ 29న రవీంద్రభారతిలో బహుమతులు అందజేశారు .ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది .
ఇది తెలంగాణ చరిత్రలో అపూర్వ ఘట్టం అని చెప్పవచ్చు .
ఏంటి చిన్న చిత్రాలను , చిన్న విషయాలను చారిత్రాత్మకం అంటున్నానని మీకు అనిపించవచ్చు కానీ ఇది అక్షరాల నిజం .
ఇంతకాలం తెలంగాణ పల్లెల్లో పాటలు పాడే వారిని , ఆటలు ఆడేవారిని , కథలు రాసేవారిని , చిన్న చిత్రాలు తీసే వారిని మట్టిలో మాణిక్యాలను ఎవరు పట్టించుకున్నారో చెప్పండి .
కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమే .
పల్లె టాలెంటును , పరిమళాలను హైదరాబాదు నగరం నడిబొడ్డులో వెదజల్లిన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును అభినందించాల్సిందే .
నేడు రేవంత్ రెడ్డి ,దిల్ రాజులు వేద జల్లిన ప్రతిభ పరిమళాలు రేపు కచ్చితంగా గుమగుమలాడుతాయి అని చెప్పడంలో సందేహం లేదు .
రేపు ఎందరో డైరెక్టర్లు , నటీనటులు, గాయకులు , రచయితలు, కెమెరామెన్లు సినీ ఇండస్ట్రీలో వెలుగు వెలుగుబోతున్నారనేది నగ్నసత్యం .
ఒకసారి రవీంద్రభారతిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం గురించి చెప్పాలంటే అదొక అద్భుత ఘట్టం.
మెయిన్ హాల్ అంతా షార్ట్ ఫిలిం మేకర్స్ తో నిండిపోయింది. కేరింతలు , చప్పట్లతో దద్దరిల్లింది .
వారి ముఖాల్లో సంతోషాన్ని ఆనందాన్ని చూస్తుంటే ప్రపంచాన్ని గెలిచిన వీరుల్లా కనిపించారు .ఇదే కదా మనకు కావలసింది .
షార్ట్ ఫిలిం మేకర్స్ బహుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 15 లక్షలు వెచ్చించింది . షార్ట్ ఫిలిం విభాగంలో ప్రథమ బహుమతి 3 లక్షల రూపాయలు , ద్వితీయ బహుమతి రెండు లక్షల రూపాయలు , తృతీయ బహుమతి ఒక లక్ష రూపాయలు చొప్పున ప్రభుత్వం అందజేసింది . కన్సోలేషన్ బహుమతులు ఐదు చిత్రాలకు పదివేల రూపాయల చొప్పున , మరో ఇద్దరికి స్పెషల్ జ్యూరీ అందజేసింది .వీడియో సాంగ్స్ విభాగంలో ఇదే రకమైన బహుమతులు అందించారు . ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు , మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక ఐఏఎస్ , తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ,సినీ దర్శకులు హరీష్ శంకర్ , దశరథ్ , సీనియర్ నటులు, రచయిత తనికెళ్ల భరణి , ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ , సినీ యువ సంగీత దర్శకులు చరణ్ అర్జున్ , ఆస్కార్ అవార్డు గ్రహీత , సింగర్ రాహుల్ సిప్లిగంజ్ , సింగర్స్ మోహన , మంగ్లీ తదితరులు పాల్గొన్నారు. విజేతలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జూపల్లి కృష్ణారావు, దిల్ రాజు బహుమతులు అందజేశారు.
మిగతా వారికి అంటే మొదటి విడతలో సెలెక్ట్ అయిన వారికి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక ఐఏఎస్ సర్టిఫికెట్లు అందజేశారు .ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన రాజు , నరేందర్ గౌడ్ టీం ను పలువురు అభినందించారు.
చివరగా ఒక మాట చెప్పదలిచాను . ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ వల్ల స్వామి కార్యం , స్వకార్యం నెరవేరింది . ఇటు తెలంగాణ యువ టాలెంట్ ను వెలుగులోకి తెచ్చారు .అటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ అయ్యేందుకు ఈ షార్ట్ ఫిలిమ్స్ దోహదం చేస్తాయి అనడంలో సందేహం లేదు .
– అయిలు రమేష్
– సీనియర్ జర్నలిస్ట్
– రాష్ట్ర అధ్యక్షులు :తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
9440002999