(పొలిటికల్ ఫ్యాక్టరీ – నెల్లూరు )
వైసీపీకి పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు పార్టీని వీడారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. తన మనసులోని మాటను బహిరంగంగానే బయట పెట్టారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఆయనకు ఎంపీ సీటుపై భరోసా రాలేదు. సీఎం వైఎస్ జగన్ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వేమిరెడ్డి సన్నిహితులు చెబుతున్న మాట. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.. ఇక ఆయనతో పాటు సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా పాలకమండలి అధ్యక్షరాలి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సమాచారం.