రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన చేసిన సేవలను దేశం గుర్తు పెట్టుకుంటుంది
టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతిని పరిష్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్థానిక పార్టీ నేతలతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూజా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అన్నారు. ముప్పైమూడేళ్ళకు పైగా కేంద్ర కేబినెట్ మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా జగ్జీవన్ రామ్ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి అన్నారు. బ్రిటిష్ వలసవాద సంకెళ్ళు తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని జగ్జీవన్ రామ్ విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నారు అని తెలిపారు. మూఢనమ్మకాలు, సామాజిక వివక్ష, అసమానతలు లేని స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సోషలిస్టు సమాజ నిర్మాణం జగ్జీవన్ రామ్ దార్శనికతలో రూపుదిద్దుకుంది అన్నారు. స్ఫూర్తిదాత, ఆదర్శనీయుడు, అణగారిన వర్గాల హక్కుల మహానాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలి అని పేర్కొన్నారు.