

(పొలిటికల్ ఫ్యాక్టరీ – హుస్నాబాద్)
పాత్రికేయ మిత్రుడు , రచయిత ,ఉపాధ్యాయుడు ‘ ప్రతిపక్షం దినపత్రిక’ సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) ఇక లేరు. గత ఆరు రోజులుగా హైదరాబాదులో నిమ్స్ లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ పరమపదించారు. ఇది చాలా విషాదకరమైన బాధాకరమైన సంఘటన.
మహమ్మద్ ఫజల్ రహ్మాన్ ఇప్పటి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందినవారు. 1960లో ఆయన అంతకపేటలో జన్మించారు. 1980 ప్రాంతంలో ఆంధ్రప్రభ కు హుస్నాబాద్ విలేకరిగా జర్నలిస్టు జీవితం ప్రారంభించారు. అందులో చాలా సంవత్సరాలు పనిచేశారు. అటు తరువాత హైదరాబాదులో ఆంధ్ర జ్యోతి, సాక్షి దినపత్రికలలో పనిచేశారు. తర్వాత ‘ దిశ ‘ పత్రిక పత్రికలో ఆవిర్భావం నుంచి పనిచేశారు. అటు తర్వాత ‘ ‘ ముద్ర ‘ పత్రికలో కొంతకాలం పనిచేసి రెండు సంవత్సరాల క్రితం తన సొంతంగా ‘ ప్రతిపక్షం ‘ దినపత్రిక ప్రారంభించి సంపాదకులుగా పనిచేస్తున్నారు. 1990 ప్రాంతంలో హుస్నాబాద్ పబ్లిక్ స్కూల్ పాఠశాల ప్రారంభించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. హుస్నాబాద్ లో ప్రెస్ క్లబ్ ఆవిర్భావంలో. జర్నలిస్టు సంఘం నిర్మాణంలో హుస్నాబాద్ యూత్ అసోసియేషన్ నిర్మాణంలో, స్ఫూర్తి అసోసియేషన్లో ఆయనకు అనుబంధం ఉంది. ఫజల్ రెహమాన్ కు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
హుస్నాబాద్ లో అంత్యక్రియలు
శనివారం రోజు తను పుట్టిన హుస్నాబాద్ లో అంత్యక్రియలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో మన తెలంగాణ దినపత్రిక ఎడిటర్ దేవులపల్లి అమర్ , సీనియర్ జర్నలిస్టులు నగునూరి శేఖర్ ,కొండ లక్ష్మణ్ , అయిలు రమేష్ , ఎలగందుల రవీందర్ , ఒంటెల కృష్ణ , అజయ్ కుమార్ , పిట్టల తిరుపతి , రంగాచారి , అన్నవరం దేవేందర్ , రాజిరెడ్డి , సదానందం , వెంకటస్వామి , జెడ్పి వైస్ చైర్మన్ రాజిరెడ్డి , అడేపు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.