కాంగ్రెస్ కు ఎంఐఎం
కార్పొరేటర్ల సంపూర్ణ మద్దతు..
కాంగ్రెస్ కు పెరుగుతున్న మద్దతు..
కరీంనగర్ చెందిన ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాదులో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు విప్పల సాయి జ్యోతి, బొట్ల శ్యామల కాంగ్రెస్ గూటికి చేరారు. వీరితోపాటు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు సౌగాని కొమరయ్య, ఆకుల నందిని ఉదయ్, పర్వతం మల్లేశం సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరిని మంత్రులు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంఐఎం కు చెందిన ముగ్గురు కార్పొరేటర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మజీదు హుస్సేన్ మంత్రుల సమక్షంలో ఆ పార్టీ జిల్లా నేత గులాం అహ్మద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కాంక్షించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కరీంనగర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన పేదలందరికీ అందిస్తామని వారు పేర్కొన్నారు.