దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేస్తూ, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలను పరిరక్షిస్తూ నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చార్టెర్డ్ అకౌంటెండ్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
వ్యాపార సంస్థలకు, పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన సలహాదారులుగా, ప్రభుత్వ ఆర్థిక విధానాలను అమలు చేయడంలో తోడ్పడుతూ బాధ్యతాయుతమైన భాగస్వాములుగా చార్టెర్డ్ అకౌంటెంట్స్ ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తున్నారని పేర్కొన్నారు.
నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయితీ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరుస్తూ సుస్థిర అభివృద్ధికి బాటలు వేయడంలో చార్టెర్డ్ అకౌంటెంట్ల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. దేశ ప్రగతికి తమ మేధస్సు, నైపుణ్యం, అంకితభావంతో సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లు మరిన్ని విజయాలు సాధించి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో మరింత తోడ్పడాలని ఆకాంక్షించారు.