హైదరాబాద్, ప్రతినిధి : ‘‘సినిమాల్లోకి రాకముందు ఏమవుతామని అడిగితే ఏం తోచేదికాదు.. అప్పుడే స్నేహితుడితో కలిసి శ్రీశైలం అడవులకు పారిపోదామనుకున్నా.. ’’అని అన్నారు సినీ హీరో పవన్ కళ్యాణ్.. ‘గోపాల గోపాల’ ఆడియో విడుదల సందర్భంగా హీరో పవన్‌కల్యాణ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తాను పాటల్లో నడుస్తానని.. కానీ, ఈసారి డ్యాన్స్ కూడా చేశానని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు పవన్ హాజరయ్యాడు. ఈ సినిమాలోని పాటలు అన్నీ బాగున్నాయని తెలిపిన ఆయన, ఈ చిత్రంలో వెంకటేష్ కామెడీ బాగుంటుందన్నాడు.
ఈ సందర్భంగా వెంకటేష్‌తో తనకున్న పరిచయాన్ని పవన్ గుర్తు చేసుకున్నాడు. పరిశ్రమకు రాకముందు ప్రతీరోజూ వెంకటేష్ ఇంటికి వెళ్లేవాడనని, ఆయన తనకు అన్నయ్యలాంటివారని వెల్లడించాడు. మరోవైపు ఈ సినిమాలో తనది సింపుల్ క్యారెక్టర్ అని వెంకటేష్ తెలియజేశాడు. తాను పవన్‌తో ఎప్పటినుంచో కలిసి సినిమా చేయాలని అనుకున్నానని, ఇన్నాళ్లకు కుదిరిందన్నాడు. ఇటు విక్టరీ, అటు పవన్ అభిమానులు ‘గోపాల గోపాల’ను పవర్‌ఫుల్ విక్టరీ చేయాలని సూచించాడు. ఇటు ఈ మూవీ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.