రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా రానున్న ‘అనెగన్’ మూవీ ట్రైలర్ కోలీవుడ్‌లో దుమ్ము రేపుతోంది. విడుదలైన కొద్దిగంటల్లోపే రెండున్నర లక్షల హిట్స్ వచ్చాయి. దీంతో ఆ మూవీ యూనిట్ ఖుషీగా వుంది. ఇందులో హీరో- హీరోయిన్ల లిప్‌లాక్ సీన్ అదుర్స్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇందులో ధనుష్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడట. చాన్నాళ్ల తర్వాత అలనాటి నటుడు కార్తీక్ దర్శనమిచ్చాడు. ధనుష్ సరసన అమౌర్య దస్తర్‌తోపాటు మరొక హీరోయిన్ నటిస్తోంది. కేవీ ఆనంద్ గతంలో డైరెక్షన్ చేసిన సినిమాలు హిట్ కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడు.