ముంబై, ప్రతినిధి : ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటిన విడుదలైన సెటైరికల్ క్రైమ్ కామెడీ త్రిల్లర్ ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’ మౌత్ టాక్ తో సంచలనం సృష్టించి విజయ పధం వైపు దూసుకు పోతోంది. ఇప్పుడు ఈ చిత్రం త్వరలో హిందీ చిత్ర సీమకు వెళుతోంది.

రాకేష్ శ్రీనివాస్ చెప్పిన మొత్తం స్క్రిప్ట్ విన్న తరువాత, బాగా ఇంప్రెస్ అయిన ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజపాయి ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’ హిందీ చిత్రం లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నారు. కథల విషయంలో, తన పాత్రల విషయం లో చాలా సెలెక్టివ్ గా ఉండే మనోజ్ బాజపాయి ఒప్పుకున్నందుకు డైరెక్టర్ రాకేష్ శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేసారు. సినిమా నిర్మించేందుకు ఒక ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ తో చర్చలు జరుగుతున్నాయని రాకేష్ శ్రీనివాస్ తెలిపారు.
మనోజ్ బాజపాయి హీరోగా హిందీలో ‘శ్యామ్ గోపాల్ వర్మ’
Leave a comment
