హైదరాబాద్, ప్రతినిధి : కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి ‘మైక్రో సాఫ్ట్ విండోస్’ పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విండోస్ ఓఎస్ వాడుతారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఈ ఓఎస్ ని యూజ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. విండోస్ లో చెప్పుకోదగ్గ ఫీచర్స్ లో ఒకటి ‘ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్’ బ్రౌజర్. విండోస్ లో బై డిఫాల్ట్ గా వచ్చే ఈ బ్రౌజర్ ఇకపై కొత్త వెర్షన్స్ లో కనిపించదు.
మైక్రో సాఫ్ట్ నుంచి కొత్తగా వచ్చే విండోస్ 10 ఓఎస్ లో ఎక్స్ ప్లోరర్ ను తీసేసి ‘స్పార్టన్’ అనే కొత్త బ్రౌజర్ ని చేర్చుతున్నట్లు సమాచారం. సరికొత్తగా డిజైన్ చేసిన స్పార్టన్ బౌజర్ లో అప్ డేటెడ్ ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విండోస్ వాడుతున్న యూజర్స్ కూడా ఎక్కువగా క్రోమ్, ఫైర్ ఫాక్స్ లాంటి యూజ్ చేయడంతో ఎక్స్ ప్లోరర్ కు ఆదరణ తగ్గింది. దీంతో, మైక్రో సాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.