హైదరాబాద్, ప్రతినిధి : సల్మాన్ ఖాన్.. తెలుగు రిమేక్ లతో హిందీలో భారీ హిట్ లు పొందిన హీరో.. 2014లో తెలుగు సినిమాలనే నమ్ముకున్న సల్మాన్.. కొత్త సంవత్సరంలోనూ మరో తెలుగు మూవీ రీమేక్ చేసే సన్నాహాల్లో ఉన్నాడని టాక్.. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న రవితేజ కిక్ 2 మూవీపై బాలీవుడ్ దర్శకుడు సాజిద్ కన్నేశాడట. సల్మాన్‌తో ‘కిక్’ రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన సాజిద్.. ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ‘కిక్ 2’ పై ఇంట్రెస్ట్‌గా ఉన్నాడని సమాచారం.
మరో రెండు ప్రొడక్షన్ సంస్థలు కూడా కిక్ -2 రైట్స్ దక్కించుకునేందుకు వీరితో పోటీపడుతున్నాయని ముంబై టాక్. ఏదేమైనా.. హీరోగా సల్మాన్ ‘కిక్ 2’ను చేయాలని ప్లాన్ చేస్తున్న సాజిద్ ఆ మూవీకి ” డెవిల్ ” టైటిల్ కూడా ఫిక్స్ చేసి సురేందర్ రెడ్డిని కన్సల్ట్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.