హైదరాబాద్, ప్రతినిధి : సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన బుడుగు టీజర్ నెట్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బుడుగు మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వుంది. ఇంద్రజ, శ్రీధర్ రావు, మాస్టర్ ప్రేమ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. బుడుగు పాత్ర చుట్టే ఈ సినిమా కథ వుంటుంది.
నిత్యం ఆఫీస్ బిజీలో వుండే అమ్మానాన్నలు తనని పెద్దగా పట్టించుకోకపోవడంతో కాస్త అసాధారణ మనస్తత్వంతో పెరిగిన బుడుగు ఏం చేశాడనేదే కథలో కీలకం అని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈమధ్యే రిలీజైన ‘బుడుగు’ ట్రైలర్స్ ఆడియెన్స్‌లో కొంత ఆసక్తిని రేకెత్తించాయి.