న్యూఇయర్ సంబురాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్త సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఘనంగా జరుపుకొన్నారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అయితే, మనకన్నా ముందే ప్రపంచంలో చాలా దేశాల్లో కొత్త ఏడాది వచ్చేసింది.. ఉరిమే ఉత్సాహంతో ప్రపంచం ఊగిపోయింది. అంతులేని ఆనందంతో….సరికొత్త ఆశయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టింది.. ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా సాగాయి.
సిడ్నీలో న్యూ ఇయర్ సంబురాలు మిన్నంటాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. నగర వీధులన్నీ విద్యుత్ కాంతులు…బాణ సంచా వెలుగుల్లో మిరుమిట్లుగొలిపాయి. రోడ్ల మీదకు చేరిన యూత్ పాటలు, డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు.
కొత్త సంవత్సర వేడుకలను అమెరికా ఘనంగా జరుపుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో న్యూయార్క్ మరింత వెలిగిపోయింది. నగరంలోని టైంస్కేవర్ దగ్గర పెద్ద బెలూన్ ను ఎగురవేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి న్యూఇయర్ కు వెల్ కమ్ తెలిపారు. న్యూ ఇయర్ ఎంట్రీతో హార్ట్ బీట్ పెంచుకున్న థాయ్ లాంట్ ప్రజలు.. కొత్త సంవత్సరం 2015 గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. ఆకాశంలోని వెలుగుల కాంతులలో ఒకరికొకరు విషెష్ చెప్పుకున్నారు. ఇటు నార్త్ కొరియాలోనూ కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎడారి దేశం దుబాయ్ లోనూ న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. వాల్డ్ వైడ్ గా కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పిన ప్రజలు..అర్ధరాత్రి వరకు సంబరాల్లో మునిగిపోయారు.