స్టార్…సూపర్ స్టార్… మెగా స్టార్… దగా స్టార్… బర్నింగ్ స్టార్… కిల్లింగ్ స్టార్…. మన దగ్గర స్టార్లే గానీ నటులు ఉండరేమో. ఒక నటుడి సినిమా హిట్టయితే హీరోను ఆకాశానికి ఎత్తుతారు. ఫ్లాపైతే దర్శకుడినీ, ఇతరులనూ తిడతారు. రజనీకాంత్ సినిమాలైతే మరీ ఓవర్.
ఇప్పుడు రజనీ శ్రేయోభిలాషులకు తత్వం బోధపడింది. లింగ ఫ్లాప్ అయింది కాబట్టి నష్టపరిహారం కోసం రజనీ కాంత్ ను డిమాండ్ చే్స్తూ నిరాహార దీక్ష చేయాలని తమిళనాడులో పంపిణీ దారులు నిర్ణయించారు. ఇది అన్యాయమని సౌత్ ఇండియా ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ (సిఫా) ఖండించింది. సినిమా విజయానికి ఒక్క హీరోనే కారణం కాదని ఓ ప్రకటన చేసింది. ఫ్లాప్ కు చాలా కారణాలుంటాయట.
మరి ఇంత కాలం రజనీ సినిమా విడుదలైనప్పుడల్లా… కొన్ని సినిమాలు హిట్ అయినప్పుడల్లా అది హీరో గొప్పే అని ఫ్యాన్స్, వగైరాలు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఈ విషయం తెలియదా. సినిమా విజయానికి హీరో ఒక్కడే కారణమైతే రజనీ నటించిన చాలా సినిమాలు ఫ్లాపయ్యాయి. వాటికి కూడా అతడే బాధ్యత వహిస్తాడా?
ఇప్పుడు బయ్యర్లు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి సినిమా జయాపజయాలకు హీరో కారణం కాదంటున్నారు. ఎంత అవకాశ వాదం.